Saudi Arabia: సౌదీ అరేబియా ప్రభుత్వం రాజధాని రియాద్‌లో ప్రత్యేకంగా ముస్లిమేతర దౌత్యవేత్తలకు సేవలందించే మొట్టమొదటి ఆల్కహాల్ దుకాణాన్ని తెరవడానికి సిద్ధమవుతోంది. సౌదీ అరేబియాలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. మద్యం తాగిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి.
ఇకపోతే మద్యం కొనుగోలు చేయలనుకునే కస్టమర్లు మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి క్లియరెన్స్ కోడ్‌ను పొందాలి. వారి కొనుగోళ్లతో నెలవారీ కోటాలను పాటించాలి.ఇస్లాంలో మద్యం సేవించడం నిషేధించబడినందున పర్యాటకం, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఒక మైలురాయి. ఇది చమురు అనంతర ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి విజన్ 2030 అని పిలువబడే విస్తృత ప్రణాళికలలో భాగంగా కూడా చెప్పుకోవచ్చు. కొత్త స్టోర్ రియాద్‌లోని డిప్లొమాటిక్ క్వార్టర్‌లో ఉంది. ఇది రాయబార కార్యాలయాలు, దౌత్యవేత్తలు నివసించేప్రాంతం. ప్రవేశం ముస్లిమేతరులకు ఖచ్చితంగా పరిమితం చేయబడుతుందని ప్రభుత్వం పేర్కొంది.
సౌదీ అరేబియా ఇటీవలి కాలంలో కఠినమైన సామాజిక నిబంధనలను సడలించింది. బహిరంగ ప్రదేశాల్లో పురుషులు, స్త్రీలను వేరు చేయడం,మహిళలు పూర్తిగా కప్పి ఉంచే నల్లని వస్త్రాలు ధరించడం వంటివి ఇందులో ఉన్నాయి. ప్రిన్స్ మొహమ్మద్ అధికారాన్ని చేపట్టాక దేశాన్ని మత రహిత పర్యాటకం, సంగీత కచేరీలు, డ్రైవింగ్‌కు అనుమతించాలని నిర్ణయించారు. విజన్ 2030లో భాగంగా స్థానిక పరిశ్రమలు, లాజిస్టిక్స్ హబ్‌లను అభివృద్ధి చేయడం, సౌదీ జాతీయులకు వేలాది ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.