Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఉక్రెయిన్ కు 400 మిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని ప్రకటించిన అమెరికా

: యునైటెడ్ స్టేట్స్ శుక్రవారం ఉక్రెయిన్ కు 400 మిలియన్ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీని ప్రకటించింది. వాటిలో మందుగుండు సామగ్రితో పాటు ట్యాంకులు, మిలిటరీ వాహనాలు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - March 4, 2023 / 04:12 PM IST

Russia-Ukraine war: యునైటెడ్ స్టేట్స్ శుక్రవారం ఉక్రెయిన్ కు 400 మిలియన్ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీని ప్రకటించింది. వాటిలో మందుగుండు సామగ్రితో పాటు ట్యాంకులు, మిలిటరీ వాహనాలు ఉన్నాయి. ఈ సహాయంలో వాహన నిర్వహణ మరియు మరమ్మత్తు కోసం విడి భాగాలు మరియు పరికరాలు కూడా ఉంటాయి. న్యూ ఢిల్లీలోని 20 దేశాల బృందం నుండి అగ్ర దౌత్యవేత్తల సమావేశంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మరియు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మధ్య గురువారం జరిగిన సంక్షిప్త సమావేశం జరిగింది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి రెండు దేశాల మధ్య ఎటువంటి సమావేశాలు జరగలేదు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను జర్మన్‌ చాన్సలర్‌ ఒలాప్‌ షోల్జ్‌ శుక్రవారంనాడు వాషింగ్టన్‌ డీసీలో భేటీ అయ్యారు. ఇరువురు నాయకులు ఉక్రెయిన్‌ యుద్ధం గురించి చర్చించుకున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి కాలుదువ్విన రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు. దీంత పాటు చైనా కూడా రష్యాకు ఆయుధాలు సరఫరా చేసి యుద్దాన్ని మరింత తీవ్ర తరం చేస్తోందని అభిప్రాయపడ్డారు.

జర్మనీ నాయకులను  అభినందించిన  బైడెన్‌ :(Russia-Ukraine war)

ఇదిలా ఉండగా రాబోయే వారాల్లో ఉక్రెయిన్‌పై దాడిని మరింత తీవ్రతరం చేస్తామని రష్యా ప్రకటించిన నేపథ్యంలో బైడెన్‌, షోల్జ్‌ భేటీ అయ్యారు. వాషింగ్టన్‌లో ఉన్నతాధికారులు ప్రధానంగా రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం గురించే చర్చించుకున్నారు. ఒక వేళ రష్యాకు చైనా పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేస్తే ఎలా స్పందించాలనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. శుక్రవారం నాడు బైడెన్‌, షోల్జ్‌ల మధ్య ఒవెల్‌ కార్యాలయంలోసమావేశం జరిగింది. కాగా జర్మనీ నాయకులను బైడెన్‌ అభినందించారు. ఎందకంటే జర్మనీ మిలిటరీ బడ్జెట్‌ను పెంచడమే కాకుండా.. రష్యా నుంచి ఇంధనం కొనుగోలును తగ్గించి ఇతర మార్గాల ద్వారా దిగుమతి చేసుకుంటోంది. దీంతోపాటు ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న దేశాల నాయకులతో కూడా వీరు చర్చించారు.నాటోలో భాగస్వాములుగా ఉన్న తాము బలంగా ఉన్నామన్నారు బైడెన్‌. యుద్దం జరిగినంత కాలం కీవ్‌కు అండగా ఉండాలని నిర్ణయించామన్నారు. ఇదిలా ఉండగా చైనా మాత్రం తాము రష్యాకు ఆయుధాలు సరఫరా చేయడం లేదని చేసే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేసింది. ఒక వేళ చైనా రష్యాకు ఆయుధాలు సరఫరా చేస్తే చైనాపై కూడా ఆంక్షలు విధించాలా వద్దా అని వాషింగ్టన్‌ నాటో కూటమి చర్చించిందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిందని రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది.

చైనా రష్యాకు ఆయుధాలు సరఫరా చేస్తే ఆంక్షలు ఖాయం..

ఇటీవల కాలంలో వాషింగ్టన్‌.. రష్యాకు చైనా పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూరుస్తోందని ప్రచారం మొదలుపెట్టింది. అయితే దీనికి సంబంధించిన సాక్షాలు చూపించడంలో అమెరికా విఫలమైంది. ఇప్పటి వరకు చైనా రష్యాకు మారణాయుధాలు సరఫరా చేయలేదని వైట్‌ హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ కరీన్ జీన్-పియర్, షోల్జ్‌ సమావేశానికి ముందు మీడియాకు చెప్పారు. ఒక వేళ చైనా రష్యాకు ఆయుధాలు సరఫరా చేస్తే భవిష్యత్తులో చైనా యూరోప్‌తో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలతో ఎలాంటి లావాదేవీలు చేయలేవని ఆమె హెచ్చరించారుసీనియర్‌ యూరోపియన్‌ అధికారి ఒకరు శుక్రవారం నాడు మాట్లాడుతూ.. ఒక వేళ చైనా మాస్కోకు మారణాయుధాలు సరఫరా చేస్తే రెడ్‌ లైన్‌ దాటినట్లేనని చైనాపై కూడా ఆంక్షలు విధించడం తథ్యమని అన్నారు. ఇప్పటి వరకు అమెరికా చైనాపై కఠినమైన ఆంక్షలు విధించింది. అయితే జర్మనీ మాత్రం అంత కఠినమై ఆంక్షలు చైనాపై విధించలేదు. అయితే గురువారం నాడు షోల్జ్‌ మాత్రం చైనాకు గట్టి హెచ్చరిక చేశారు. మాస్కోకు ఆయుధాలు సరఫరా చేయవద్దని డిమాండ్‌ చేయడమే కాకుండా బీజింగ్‌ తన పలుకుబడిని ఉపయోగించి రష్యాను యుద్ధం నుంచి తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరాలన్నారు.