Mexico: మంగళవారం తెల్లవారుజామున సెంట్రల్ మెక్సికోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మెక్సికన్లు మరియు ఒక వెనిజులా దేశస్తుడు మరణించినట్లు మెక్సికో యొక్క ఐఎన్ఎం మైగ్రేషన్ ఇన్స్టిట్యూట్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
వెనిజులా వలసదారులు..(Mexico)
మెక్సికోలోని మియాహుట్లాన్-కోయిక్‌స్ట్లాహుకా హైవేపై బస్సులో ప్రయాణిస్తున్న 52 మంది ప్రయాణికుల్లో వెనిజులాకు చెందిన 10 మంది ప్రయాణికులు ఉన్నారని, యునైటెడ్ స్టేట్స్‌లో చట్టపరమైన ప్రవేశం కోసం వారికి అపాయింట్‌మెంట్‌లు ఉన్నాయని ఐఎన్ఎం తెలిపింది. తెల్లవారుజామున ట్రయిలర్ ను బస్సు ఢీకొనడంతో 36 మంది ప్రయాణికులు గాయపడి ఆసుపత్రికి తరలించారని ప్యూబ్లా రాష్ట్ర అధికారులు ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది వెనిజులా నుంచి వలస వచ్చినవారేనని స్థానిక మీడియా నివేదించింది.