Site icon Prime9

Rishi Sunak: బ్రిటన్‌లో మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రిషి సునాక్‌ ప్రభుత్వం

budget

budget

London: బ్రిటన్‌లో రిషి సునాక్‌ ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి ఆదాయపు పన్ను పెంచడంతో పాటు ప్రభుత్వ వ్యయాన్ని భారీగా కోత విధించింది. మాజీ ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌ తీసుకున్న నిర్ణయం వల్ల పోయిన పరపతి నిలబెట్టుకొనేందుకు ప్రభుత్వం గట్టి కృషి చేసినట్లు కనిపిస్తోంది. 55 బిలియన్‌ పౌండ్ల బడ్జెట్‌ ప్రణాళికను రూపుదిద్దారు. వాటిలో పన్నుల ద్వారా పెద్ద మొత్తంలో సేకరించుకోవడంతో పాటు, ప్రభుత్వ వ్యయాన్ని సగానికి సగం తగ్గించుకోవడం ద్వారా బడ్జెట్‌ అంచనాలను చేరుకోవాలనుకుంటోంది. మొత్తానికి బ్రిటన్‌ ప్రస్తుతం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిందని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది సరాసరి ద్రవ్యోల్బణాన్ని 9.1 శాతానికి వచ్చే ఏడాది 7.4 శాతానికి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆర్థికమంత్రి.

అయితే ఆర్థిక నిపుణులు మాత్రం పెరుగుతున్న ధరలతో సామాన్యుడి జీవితం దుర్భరం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల వేతనాలు తగ్గడంతో పాటు ఏప్రిల్‌ 2024 నాటికి ప్రజల జీవన ప్రమాణాలు 7 శాతం క్షీణిస్తాయని అంచనా వేశారు. 2024 లో బ్రిటన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి చూస్తే గత ఎనిమిది నెలల నుంచి బ్రిటన్‌ వృద్ది రేటు తిరోగమనబాట పడుతోంది. ఇప్పటికే లక్షలాది బ్రిటిషర్లు పెరిగిపోతున్న ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్టోబర్‌ ద్రవ్యోల్బణం 11.1 శాతానికి ఎగబాకింది. 41 ఏళ్ల గరిష్ఠానికి చేరింది.

బ్రిటన్‌ కరెన్సీ స్టెర్లింగ్‌ విషయానికి వస్తే డాలర్‌ మారకంతో పోల్చుకుంటే ఒక శాతం క్షిణించగా, యూరోతో పోల్చుకుంటే 0.2 శాతం క్షీణించింది. దీర్ఘకాలం పాటు బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థగాడిన పడే అవకాశాలు కనిపించడం లేదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీర్థకాలిక ప్రణాళికలతోనే ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే అవకాశాలున్నాయని సీనియర్‌ మార్కెట్‌ ఎనలిస్టులు చెబుతున్నారు.

Exit mobile version