Site icon Prime9

Queen Elizabeth II: క్వీన్ ఎలిజ‌బెత్ 2 రాసిన లేఖ.. ఏముందో తెలియాలంటే మరో 63 ఏళ్లు ఆగాలి..

Queen-Elizabeth-II-letter-to-Australia

Sydney: క్వీన్ ఎలిజ‌బెత్ 2 కన్నుమూసిన తరువాత ఆమెకు సంబంధించి పలు విశేషాలు బయటకు వస్తున్నాయి. వాటిలో ఒకటి ఆమె రాసిన లేఖ. బ్రిట‌న్ రాణి రాసిన ఆ లేఖ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

బ్రిట‌న్ క్వీన్ ఎలిజబెత్ II త‌న జీవిత‌కాలంలో అనేక సార్లు ఆస్ట్రేలియాను సంద‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే ఆమె అక్క‌డి పౌరుల‌కు త‌న సందేశం వినిపించ‌డానికి ఒక లేఖ రాసింది. దానిని సిడ్నీలోని ఒక చారిత్రాత్మక భవనంలో భ‌ద్రంగా దాచిపెట్టారు. ఆ లేఖను 63 సంవ‌త్సరాలు దాటేంత వరకు తెరిచే అవ‌కాశంలేదు. ఎందుకంటే. దానిని 2085 తెరిచి అక్క‌డి ప్ర‌జ‌ల‌కు త‌న సందేశం అందించాల‌ని క్వీన్ ఎలిజ‌బెత్ లేఖ‌పై రాశారు.

లార్డ్ మేయర్ ఆఫ్ సిడ్నీని ఉద్దేశించి, క్వీన్ ఎలిజ‌బెత్ “క్రీ.శ. 2085లో మీరు ఎంపిక చేసుకునేందుకు తగిన రోజున, దయచేసి ఈ కవరు తెరిచి, సిడ్నీ పౌరులకు నా సందేశాన్ని తెలియజేస్తారా” అని పేర్కొంటూ, ఇది కేవలం “ఎలిజబెత్ ఆర్” అని సంతకం చేయబడింద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాబట్టి దానిని తెరవడానికి మరో 63 సంవత్సరాలు కావాలి. కాగా, త‌న జీవితకాలంలో క్వీన్ ఎలిజబెత్ II 16 సార్లు ఆస్ట్రేలియాను సందర్శించారు.

Exit mobile version
Skip to toolbar