Site icon Prime9

Canada: కెనడా ప్రధానమంత్రి ముందే ఖలిస్తానీ నినాదాలు!

canada

canada

Canada: కెనడాలో సిక్కుల హవా ఎలా నడుస్తుందో చెప్పడానికి ఇదో చక్కటి ఉదాహరణ. అక్కడ ప్రభుత్వం బతికి బట్టకట్టాలంటే సిక్కుల మద్దతు తప్పనిసరి. అయితే ఆదివారం టోరంటోలో ఖల్సా డే సంబరాలు జరిగాయి. కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో సమక్షంలో ఖలిస్తాన్‌కు అనుకూలంగా.. అలాగే ప్రతిపక్ష నాయకుడు పియర్ పోయిలీవ్రేకు మద్దతుగా నినాదాలు చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇటీవల కాలంలో ఇండియాకు – కెనడాకు మధ్య సంబంధాలు మరింత బలహీనంగా ఉన్నప్పుడు ఈ నినాదాలు రావడం గమనార్హం. ఖల్సా డే సందర్భంగా ప్రధానమంత్రి ట్రూడో సభికులను ఉద్దేశించి ప్రసంగించాలని సీటు నుంచి లేచినప్పుడు ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆయన తన సీటు నుంచి లేచి వేదిక మీదకు వచ్చే సరికి నినాదాలు మరింత ఊపందుకున్నాయని కెనడాకు చెందిన సీపీఏసీ టీవీ తెలిపింది.

ఖలిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు సిక్కులు. కాగా ఎన్‌డీపీ నాయకుడు జగమీత్‌ సింగ్‌, టోరంటో మేయర్‌ ఓలివా చౌ సమక్షంలో ఈ నినాదాలు మిన్నంటాయి. ఇలాంటి ఘటనే కెనడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పియర్‌ పోయిలీవ్రే కూడా స్టేజి మీదకు వస్తున్నప్పుడు ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కాగా ఆదివారం నాడు ఖల్సా డే సంద్భంగా దేశంలోని పలునగరాల నుంచి టోరంటోకి పెద్ద ఎత్తున సిక్కులు వచ్చారు. అంటారియో సిక్‌ గురుద్వారాస్ కౌన్సిల్.. వైశాఖిని ఖాల్సాడే అని పిలుస్తారు. కాగా 1699లో సిక్కు కమ్యూనిటి ఖల్సాడేను సిక్కు కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. కాగా గత కొన్ని సంవత్సరాల నుంచి లేక్‌ షోర్‌ బౌలేవార్డ్‌ వరకు సిక్కులు పెద్ద ఎత్తున పరేడ్‌ నిర్వహించడం ఇక్కడ పరిపాటి.

కెనడాలో 8 లక్షలమంది సిక్కులు..(Canada)

ఇదిలా ఉండగా ప్రధానమంత్రి ట్రూడో సిక్కుల నినాదాల మధ్యనే ప్రసంగించారు. విభిన్న జాతుల సమాహరమే కెనడా బలమని వ్యాఖ్యానించారు. తమ మధ్య అభిప్రాయభేదాలున్నా తామంతా ఐక్యంగా ఉన్నామని ఆయన అన్నారు. కెనడాలో సిక్కుల జనాభా 8 లక్షల వరకు ఉంటుంది. సిక్కుల హక్కులతో పాటు వారి స్వేచ్చను రక్షిస్తామన్నారు ట్రూడో. సిక్కు కమ్యూనిటికి భద్రతను కట్టుదిట్టం చేస్తామని అలాగే గురుద్వారాలకు భద్రత కల్పిస్తామని ట్రూడో హామీ ఇచ్చారు. కాగా ఇండియాలో పలు టెర్రర్‌ కార్యకలాపాలకు పాల్పడిన హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ కెనడాలో తలదాచుకుంటున్నాడు. అయితే నిజ్జర్‌ను గత ఏడాది జూన్‌ 18న గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన తర్వాత ఇండియా- కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇండియానే నిజ్జర్‌ను కాంట్రాక్ట్‌ కిల్లర్ల ద్వారా చంపించిందని కెనడా ఆరోపిస్తోంది. కాగా ఇండియా మాత్రం నిజ్జర్‌ హత్యతో ఇండియాకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంకా కుదుటపడలేదు

Exit mobile version