Site icon Prime9

PM Modi: ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. భారత ప్రధాని కోసం బైడెన్ స్టేట్ డిన్నర్

PM Modi

PM Modi

PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటకు వెళ్లనున్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు మోదీ అమెరికా వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 22 న ప్రధాని మోదీ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. భారత భవిష్యత్ కు సంబంధించి తన దృక్పథం, ప్రస్తుతం రెండు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు లాంటి అంశాలపై మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

గౌరవంగా భావిస్తున్నాం

అదే విధంగా మోదీ గౌరవార్థం జో బైడెన్ 22 న స్టేట్ డిన్నర్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ కు చెందిన నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ ద్వైపాక్షిక నాయకత్వం తరపున ఈ నెల 22 న కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు మోదీ ని ఆహ్వానించడంపై గౌరవంగా భావిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

 

 

రెండో సారి ప్రసంగం

కాగా అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రెండో సారి ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఇటువంటి అరుదైన ఘనత లభించిన నాయకుల్లో బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మొదలైన వారు ఉన్నారు. జీ20 కూటమికి ఈ ఏడాది భారత్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Exit mobile version