Namo Drone Didi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు ‘నమో డ్రోన్ దీదీ’ కార్యక్రమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా చేపట్టిన విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో సంభాషించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన పథకాలను సద్వినియోగం చేసుకోవలన్నారు. ఈ పథకాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సమయానుకూలంగా చేరతాయని తెలిపారు.
వ్యవసాయ ప్రయోజనం కోసం రైతులకు అద్దె సేవలను అందించడానికి 2024-25 నుండి 2025-2026 మధ్య కాలంలో ఎంపిక చేసిన 15,000 మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌లను అందించడం ఈ నమో డ్రోన్ దీదీ పథకం లక్ష్యం.మహిళలను నైపుణ్యం మరియు ‘డ్రోన్ దీదీ’గా మార్చుతానని నేను ఎర్రకోట (77వ స్వాతంత్ర్య దినోత్సవం)పై నుండి ప్రకటించాను. తక్కువ సమయంలో, వేలాది మంది గ్రామాల్లోని మహిళలు డ్రోన్లను ఆపరేట్ చేయడం నేర్చుకున్నారు.’ద్రోన్ దీదీ’ కార్యక్రమానికి నేను నమస్కరించే సందర్భం ఇది. దానిని ‘నమో డ్రోన్ దీదీ’ ప్రోగ్రామ్‌గా మార్చాలని నేను ప్రతిపాదిస్తున్నానని మోదీ అన్నారు.
ఈ కార్యక్రమంలో, సబ్సిడీ ధరలకు మందులను విక్రయించే జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుండి 25,000 కు పెంచుతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. దియోఘర్‌లోని ఎయిమ్స్‌లో మైలురాయి 10,000వ జన ఔషధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రధానమంత్రి విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఈ పథకాల ప్రయోజనాలు లక్ష్యిత లబ్ధిదారులందరికీ సకాలంలో చేరేలా చూడడం ద్వారా ప్రభుత్వ ప్రధాన పథకాల సంతృప్తతను సాధించాలనే లక్ష్యంతో విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రను దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది.