Site icon Prime9

లండన్: 2,500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యను పరిష్కరించిన పీహెచ్‌డీ విద్యార్థి

England

England

London: 2,500 ఏళ్ల క్రితం సంస్కృతపండితుడు పాణిని బోధించిన నియమాన్ని కేంబ్రిడ్జికి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి 27 ఏళ్ల రిషి రాజ్‌పోపట్ డీకోడ్ చేశారు. ఈ వ్యాకరణ సమస్యను పరిష్కరించేందుకు తొమ్మిది నెలల పాటు ప్రయత్నించిన రిషి రాజ్‌పోపట్ కేంబ్రిడ్జ్‌లో తనకు ఇదొక అద్భుతమైన ఆవిష్కరణ ఘట్టమని అన్నారు.

పాణిని ‘మెటారూల్’ను నేర్పించారు. ఈ రూల్ ప్రకారం సమాన బలం గల రెండు నియమాల మధ్యన వైరుధ్యం ఏర్పడినప్పుడు, వ్యాకరణ అనుసరణలో ఆ తర్వాత వచ్చే నియమమే గెలుస్తుందని సంప్రదాయంగా నిర్వచించారు.రిషి రాజ్‌పోపట్ సంప్రదాయబద్ధమైన ఈ మెటారూల్ నిర్వచనాన్ని కొట్టివేశారు. పాణిని నియమంలో పదానికి కుడి, ఎడమ వైపు నిబంధనలు వర్తింపచేసే సమయంలో, పదానికి కుడి వైపున వర్తించే నియమాన్నే ఎంచుకోవాలని పాణిని చెప్పారని ఆయన వివరించారు.ఈ భాష్యాన్ని ఉపయోగించటం ద్వారా.. పాణిని వ్యాకరణ పరంగా సరియైన పదాలను రూపొందిస్తున్నట్లు ఆయన గుర్తించారు.కేంబ్రిడ్జ్‌లో సంస్కృత ప్రొఫెసర్ విన్సెంజో వెర్జియాని, రిషికి మార్గనిర్దేశం చేశారు. ఎన్నో శతాబ్దాలుగా ఎంతో మంది పండితులు పరిష్కరించలేని ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని రిషి కనుకొన్నాడని విన్సెంజో అన్నారు.

Exit mobile version