Site icon Prime9

Pakistan: పాకిస్థాన్‌ లో పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్ లతీఫ్‌ను కాల్చిచంపిన గుర్తు తెలియని దుండగులు

Shahid Latif

Shahid Latif

Pakistan: భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన, పఠాన్‌కోట్ దాడికి సూత్రధారి అయిన షాహిద్ లతీఫ్ పాకిస్థాన్‌లో హతమయ్యాడు.  సియాల్‌కోట్‌లో గుర్తు తెలియని సాయుధులు అతడిని కాల్చిచంపినట్లు సమాచారం. షాహిద్ లతీఫ్ భారతదేశంలో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.

వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ..(Pakistan)

షాహిద్ లతీఫ్ 2016 పఠాన్ కోట్ దాడికి ప్రధాన కుట్రదారు. .నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం)లో షాహిద్ లతీఫ్ కీలక సభ్యుడు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదానికి సంబంధించి అతను నవంబర్ 12, 1994న జమ్మూ కశ్మీర్ లో అరెస్టయ్యాడు. 16 ఏళ్ల జైలు శిక్ష తర్వాత, 2010లో వాఘా సరిహద్దు వద్ద అతడిని పాకిస్తాన్ కు అప్పగించారు. భారత ప్రభుత్వ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో షాహిద్ లతీఫ్ పేరు ఉంది. ట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద ఒక కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అతనిని విచారించింది.

1999లో, ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ IC814ను ఐదుగురు సాయుధ వ్యక్తులు ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌కు వెళుతుండగా హైజాక్ చేసిన సమయంలో, హైజాకర్‌లు విడుదల కోరిన వ్యక్తులలో షాహిద్ లతీఫ్ కూడా ఉన్నాడు. చర్చల్లో భాగంగా విడుదలైన ఖైదీల్లో ప్రముఖ ఉగ్రవాది మసూద్ అజార్ ఒకరు కావడం గమనార్హం. హైజాకింగ్ సమయంలో బందీలుగా ఉన్న 189 మంది ప్రయాణికులు మరియు సిబ్బందిని విడుదల చేయడానికి ఈ మార్పిడి జరిగింది.

Exit mobile version