Site icon Prime9

Papua New Guinea Mayhem: పవువా న్యూ గినియాలో కొండచరియలు విరిగి పడి 2,000 మంది సజీవ సమాధి

Papua New Guinea

Papua New Guinea

Papua New Guinea Mayhem:పవువా న్యూ గినియాలో కొండచరియలు విరిగి పడి సుమారు 2,000 మంది కంటే ఎక్కువ మంది మట్టి పెళ్లలో కూరుకుపోయారని అక్కడి జాతీయ విపత్తు కార్యాలయం వెల్లడించింది. అయితే రెస్క్యూ వర్కర్స్‌ మట్టి పెళ్లలో కూరుకుపోయిన వారిని బయటికి తీయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. పావువా న్యూ గినియాకు ఉత్తరాన ఎంగా కొండ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఐక్యరాజ్యసమితి ముందుగా 100 మంది చనిపోయారని తెలిపింది. తర్వాత మృతుల సంఖ్య 670కు పెరిగిందని మృతుల సంఖ్యను సవరించింది.

ఆర్దిక వ్యవస్దపై ప్రభావం..(Papua New Guinea Mayhem)

అయితే తాజాగా అమెరికాకు చెందిన సీఎన్‌ఎన్‌ వార్తసంస్థ మాత్రం కొండచరియలు విరగిపడి సుమారు 2,000 మంది వరకు సమాధి అయ్యారని తెలిపింది. కొంచరియలకు పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలాయి. అదే సమయంలో కూరగాయాల తోటలు ధ్వంసం కావడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని జాతీయ విపత్తు సెంటర్‌ యాక్టింగ్‌ డైరెక్టర్‌ లుసెటీ లాసో మానా యూఎన్‌కు ఒక లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి. రెస్క్యూటీంతో పాటు పేలుళ్లలో చిక్కుకుపోయిన వారికి కూడా ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే పేలుళ్లు జరిగిన ప్రాంతంలో రోడ్డు పూర్తిగా కుంగిపోయింది రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా పెద్ద రిస్క్‌తో కూడుకుందని అధికారులు తెలిపారు. ఇప్పటికి తరచూ పెద్ద పెద్ద రాళ్లు పడుతున్నాయని అధికారులు చెప్పారు. ఇకపావువా న్యూ గినియా విషయానికి వస్తే ఇక్కడి జనాభా సుమారు కోటి వరకు ఉంటుంది. ఈ ప్రాంతమంతా కొండ ప్రాంతం, రోడ్‌ సౌకర్యం కూడా సరిగా లేదు. దీంతో దేశంలోని మారుమూల ప్రాంతానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. కొండచరియలు విరిగి పడిన తర్వాత భవనాలతో పాటు మనుషులు కూడా డజన్ల మీటర్ల లోతులో కూరుకుపోతారని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. అయితే కొండచరియల్లో కూరుకుపోయిన వారు ఎక్కడ ఉన్నారో కనిపెట్టడం కూడా కష్టమేనని చెబుతున్నారు. అలాగే కొండచరియలు విరిగిపడ్డానికి కారణం ఏమిటనే విషయం గురించి కూడా సరిగా తెలియడం లేదని యూనివర్శిటీ ఆఫ్‌ అడిలైడ్‌ జియాలజీ ప్రొపెసర్‌ అలాన్‌ కోలిన్స్‌ చెప్పారు.

 

 

Exit mobile version