Site icon Prime9

Pakistani cricketers: పీఎస్ఎల్ టైటిల్ గెలిచిన పాక్ క్రికెటర్లకు అదిరిపోయే గిఫ్ట్‌లు.. వెల్లువెత్తిన విమర్శలు

Pakistani cricketers

Pakistani cricketers

Pakistani cricketers:మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌ తీవ్ర మైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యుడికి రెండు పూటల తిండి దొరకడమే గగనమైంది. బిలియన్‌ డాలర్ల అప్పు కోసం ఐఎంఎఫ్‌ కాళ్లా వేళ్లా పడ్డా కనికరించడం లేదు. ఇలా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అక్కడి పాకిస్తాన్‌ ఆటగాళ్లకు మాత్రం ఖరీదైన ప్లాట్లు, ఐఫోన్లను గిఫ్ట్‌లుగా అందజేశారు. ఇప్పుడు ఈ వార్త పాక్‌లో దుమారం రేపుతోంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఇటీవలే ముగిసిన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ తొమ్మిదో సీజన్‌ విజేతగా లాహోర్‌ ఖలండర్స్‌ నిలిచింది. ముల్తాన్‌ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో షాహిన్‌ అఫ్రిది సేన విజయం సాధించి వరుసగా రెండోసారి పీఎస్‌ఎల్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఖరీదైన ప్లాట్లు, ఐఫోన్లు.. (Pakistani cricketers)

దీంతో ఫ్రాంఛైజీ యజమాని లాహోర్‌ ఖలండర్స్‌ సీవోవో సమీన్‌ రాణా ఆటగాళ్లకు అదిరిపోయే గిఫ్ట్ లు అందజేశారు. ప్లేయర్స్ అందరికీ ప్లాట్లు, ఐఫోన్లు ఇచ్చారు. ఈ ఫ్రాంఛైజీ ఓనర్ ఖలందర్స్ సిటీ అనే ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేపట్టింది. దీంతో తమ ప్లేయర్స్ కు అందులోనే ప్లాట్లు ఇచ్చింది. ఈ ప్లాట్లు, ఐఫోన్లు అందుకున్న వాళ్లలో స్టార్ ప్లేయర్స్ షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్, జమాన్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఉన్నారు.

ఒక్కొక్క ప్లేయర్ కు 5,445 చదరపు అడుగుల ప్లాట్లు ఇచ్చారు. వీటి విలువ పాకిస్థాన్ కరెన్సీ ప్రకారం 92. 5 లక్షలు కాగా.. ఇండియన్ కరెన్సీలో 27 లక్షలు. ఈ లీగ్ లో మొత్తం ఆడే అవకాశం రాకుండా బెంచ్ కే పరిమితమైన ప్లేయర్స్ కు కూడా ఈ ప్లాట్లు ఇచ్చారు. పీఎస్‌ఎల్‌ ఫైనల్లో బ్యాట్‌తోనూ, బంతితోను మెరిసి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదికి అదనంగా గిఫ్ట్‌లు అందించడం విశేషం. ఫైనల్లో మొదట బ్యాటింగ్‌లో 44 రన్స్.. ఆ తర్వాత బౌలింగ్ లో రాణించిన షాహిన్‌ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. లాహోర్ టీమ్ లీగ్ గెలిచినందుకు ఒక ప్లాట్ అందుకున్న షాహీన్.. కెప్టెన్ గా వ్యవహరించినందుకు మరో రెండు ప్లాట్స్‌ అదనంగా అందుకోవడం విశేషం.

ఇది చూసిన క్రికెట్‌ అభిమానులుదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పాక్‌ ఆటగాళ్లకు లభించిన గిఫ్ట్‌లను డబ్బుల రూపంలో దేశానికి అందిస్తే బాగుండేది” అంటూ షోషల్‌ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా దేశంలోని 51 శాతం మంది ప్రజలు పీఎస్‌ఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ చూడలేదన్న వార్తలు వస్తున్నాయి.

Exit mobile version
Skip to toolbar