Site icon Prime9

Pakisthan: సబ్సిడీ గోధుమపిండి కోసం గంటల తరబడి క్యూలో పాకిస్తాన్ పౌరులు.. ఎందుకో తెలుసా?

Wheat

Wheat

Pakisthan: పాకిస్తాన్‌ దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా గోధుమ కొరతను ఎదుర్కొంటోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గోధుమ పిండి కోసం ప్రజలు ఒకరి నొకరు తీసుకుంటున్న దృశ్యాలు షోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా ఖైబర్‌ ఫంక్తూన్‌ క్వా, సింధ్‌, బలుచిస్తాన్‌లలో ఇలాంటి దృశ్యాలు కామన్‌ అయిపోయాయి. మీడియాలో వస్తున్నవార్తల ప్రకారం సబ్సిడీకి లభించే గోధుమ పిండి కోసం వేలాది మంది పౌరులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుర్భర పరస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో సరఫరా బాగా మందగించింది. షోషల్‌ మీడియాలో కొన్ని షాకింగ్‌ వీడియోలు వెలుగుచూస్తున్నాయి. గోధుమ పిండి బ్యాగుల కోసం ప్రజలు కొట్టుకుంటున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

హృదయవిదారక దృశ్యాలు పాకిస్తాన్‌లో తరచూ కనిపిస్తున్నాయి.వాహనాల్లో సబ్సిడీ గోధుమ పిండి వాహనాలు రావడంతోనే ప్రజలు ఆ వాహనం చుట్టుముడుతున్నారు. ఆ వాహనం వెనుకనే మిని ట్రక్కులో భద్రతా దళాలు వస్తున్నాయి. ప్రజలకు గోధుమ పిండి పంపిణి చేద్దామనుకుంటే.. ప్రజలు ఒకరికొకరు తీసుకుంటూ వారిలో వారు కొట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. శనివారం మిర్‌పుర్‌ఖాస్‌లోని గులిస్తాన్-ఇ-బల్దియా పార్క్‌లో నిర్దేశిత ప్రదేశంలో సరుకు చేరుకోగానే వందల మంది ప్రజలు ట్రక్కులపై దాడి చేయడంతో తొక్కిసలాటలో ఒక కార్మికుడు చనిపోయాడు. ఈ ఘటనలో మరికొంతమంది గాయపడ్డారు.

గోధుమ పిండి కొరత

పాకిస్తాన్‌(Pakisthan)లో ప్రస్తుతం గోధుమ కొరతకు కారణం ఫెడరల్‌ గవర్నమెంట్‌తో పాటు పంజాబ్‌ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని డీలర్లు చెబుతున్నారు. పంజాబ్‌ ఫుడ్‌ డిపార్టుమెంట్‌ వాస్తవంగా ఎంత గోధుమ అవసరం అవుతుందో ఎంత దిగుమతి చేసుకోవాలనే అంశంపై పూర్తిగా విఫలం అయ్యాయని వారు అంటున్నారు. ఇదిలా ఉండగా దేశంలో గోధుమలు, గోధుమ పిండి ధర చుక్కలనంటిందని మీడియాలో కథనలు వెల్లువెత్తుతున్నాయి.

పంజాబ్ లో పాకిస్థాన్ ఎఫెక్ట్

కరాచీలో గోధుమ పిండి కిలో 140 రూపాయిల నుంచి 160 వరకు విక్రయిస్తున్నారు.

ఇస్లామాబాద్‌, పెషావర్‌లలో పది కిలోల గోధుమ పిండి బ్యాగ్‌ 1,500 రూపాయలకు చేరింది. కాగా 20 కిలోల బస్తా 2,800 పలుకుతోంది.

పంజాబ్‌లోని మిల్‌ యజమానులు మాత్రం కిలో గోధుమ పిండి ధర 160 రూపాయలకు పెంచేశారు.

అలాగే ఖైబర్‌ ఫంక్తూన్‌ క్వాలో మాత్రం పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఇక్కడ 20 కిలోల బ్యాగ్‌ 3,100 రూపాయలకు చేరింది.

ఇంత జరిగినా ధరలను నియంత్రించడంలో పాకిస్తాన్‌లోని షరీఫ్ ప్రభుత్వం మాత్రం ఘోరంగా విఫలం అయ్యింది. బలుచిస్తాన్‌ ఆహారమంత్రి జమ్రాక్‌ అచక్‌జాయి మాత్రం తమ ప్రావిన్స్‌లో గోధుమ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయని చెప్పారు. తక్షణమే బలుచిస్తాన్‌కు 4 లక్షల బస్తాల గోధుమ పిండి కావాలన్నారు. లేదంటే పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పుతాయని హెచ్చరించారు. ఇక ఖైబర్‌ ఫంక్తూన్‌క్వా లో ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. స్థానికంగా రొట్టెలు తయారు చేసే వారు ధరలను అమాంతం పెంచేశారు. కేవలం రొట్టెలే కాకుండా బేకరి ఐటెంలన్నిటి ధరలు విపరీతంగా పెంచేశారు.

గత రెండేళ్ల నుంచి నిత్యావసర ధరలు పాకిస్తాన్‌లో విపరీతంగా పెరిగిపోయాయి. అదే సమయంలో పెరిగిపోతున్న ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అవుతోంది. పాక్‌ పాలకుల్లో చిత్తశుద్ది లేదని ప్రజలు బహిరంగంగానే ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఒక వైపు ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే.. రాజకీయా నాయకులు మాత్రం తమ పబ్బం గడుపుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పిటిఐ చీఫ్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వెంటనే దేశంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరో వైపు అధికారంలో ఉన్న షెహబాజ్ షరీఫ్‌ ప్రజలను పట్టించుకోవడం లేదు.

ఇవి కూడా చదవండి

Ram Charan: రామ్‌చరణ్ మెగా రివీల్: నెక్ట్స్ మార్వెల్ హీరో.. ఐరన్ మ్యాన్ vs కెప్టెన్ అమెరికా.. నేను నటించే సూపర్ హీరో క్యారెక్టర్ ఏంటంటే..

Ram Charan: రామ్‌చరణ్ గోల్డెన్ గ్లోబ్ ఇంటర్వ్యూ: ఏం యాక్సెంట్‌రా బాబూ.. మెగా పవర్‌స్టార్ అదరగొట్టేశాడు..

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version