Imran Khan Arrest: ఇమ్రాన్ అరెస్టుతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్థాన్‌లో పరిస్థితి గందరగోళంగా తయారయ్యింది. దేశంలో నెలకొన్న తీవ్రఉద్రిక్త పరిస్థితులను అధికారులు అదుపు చెయ్యలేకపోతున్నారు. కాగా ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తరువాత తాజాగా బుధవారం రాత్రి ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతినుద్దేశించి ప్రసంగించారు.
శ్రతువు చేయలేని పనిని ఇమ్రాన్ చేశాడు(Imran Khan Arrest)..
రోగులను అంబులెన్స్‌లో నుంచి బయటకులాగి మరీ ఆందోళనకారులు అంబులెన్స్ కు నిప్పంటించారు. 75ఏళ్ల పాకిస్థాన్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరుగలేదు. అసలైన శ్రతువు చేయలేని పనిని ఇమ్రాన్ మద్దతు దారులు చేశారు అంటూ ప్రధాని షెహబాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనల్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామనిషెహబాజ్ షరీఫ్ అన్నారు.
అల్ ఖాదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి 5వేల కోట్లు దోచుకున్నారని దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని షెహబాజ్ అన్నారు. సాక్ష్యాధారాల ఆధారంగానే నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) విచారణ జరుపుతోందని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ చట్టాన్ని దెబ్బతీశారు. ఇది క్షమించరాని నేరమని ఆయన పేర్కొన్నారు. ఇమ్రాన్ అరెస్టుకు వ్యతిరేకంగా పీటీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది.
ప్రధాని ఇంటిపై దాడి
ఇకపోతే ఇమ్రాన్ అరెస్టును ఖండిస్తూ ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ షట్ డౌన్ కు పిలుపునిచ్చారు. అంతేకాక ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంటిపై దండెత్తి అక్కడున్న పార్కింగ్ స్థలంలోని వాహనాలకు నిప్పంటిచారు.