Site icon Prime9

Pakistan: పాకిస్తాన్: 26/11 దాడుల సూత్రదారి హఫీజ్ సయీద్ సన్నిహితుడు ఫరూక్ కాల్చివేత

Pakistan

Pakistan

 Pakistan: పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) మోస్ట్ వాంటెడ్ నాయకులలో ఒకరిని కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని పాకిస్తాన్ మీడియా నివేదించింది.26/11 ముంబై దాడి సూత్రధారి హఫీజ్ సయీద్ సన్నిహితుడు ముఫ్తీ ఖైజర్ ఫరూక్ ను కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

ఈ ఘటన ఫరూక్ ను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిగానే ఉంది. దాడి జరిగిన వెంటనే ఫరూక్ ను ఆసుపత్రికి తరలించగా  అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. , ఈధి సెంటర్ సమీపంలోని గుల్షన్-ఇ-ఉమర్ సెమినరీలో 30 ఏళ్ల కైజర్ ఫరూఖ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.  అతడిని  అబ్బాసీ షాహీద్ ఆసుపత్రికి తరలించినట్లు సమనాబాద్ ఎస్‌హెచ్‌ఓ ఇర్షాద్ అహ్మద్ సూమ్రో తెలిపారు. వెనుక భాగంలో బుల్లెట్ గాయాలు తగలడంతో ఖైజర్ ఫరూఖ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మోస్ట్ వాంటెడ్ జాబితాలో ..( Pakistan)

ఫరూక్ లష్కరే తోయిబా వ్యవస్దాపక సభ్యుల్లో ఒకడు. అతను హఫీజ్ సయీద్ కు ప్రధాన అనుచరుడు. అతను పేరుమోసిన ఉగ్రవాది. భారత నిఘా సంస్దల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. తాజా ఘటన లష్కరే తోయిబా నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బనే చెప్పవచ్చు.మరోవైపు పాకిస్తాన్‌లో హఫీజ్ సయీద్ కుమారులలో ఒకరైన కమాలుద్దీన్ సయీద్ సెప్టెంబర్ 26, మంగళవారం అదృశ్యమయ్యారు. కమాలుద్దీన్ సయీద్‌ను పెషావర్‌లో కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు తెలిసింది. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ అతడిని కనిపెట్టలేకపోయింది. కిడ్నాప్ చేసిన రెండు రోజుల తర్వాత, పాకిస్తాన్‌లోని పెషావర్‌లో కమాలుద్దీన్ మృతదేహం లభ్యమైంది.ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్ మరణం మరియు కమాలుద్దీన్ సయీద్ అదృశ్యం చుట్టూ ఉన్న పరిస్థితులు మిస్టరీగా ఉన్నాయి.

ముంబైలో 26/11 ఉగ్రదాడుల సూత్రధారి మరియు అంతర్జాతీయంగా బ్లాక్‌లిస్ట్ చేయబడిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా మరియు రష్యాతో సహా వివిధ అంతర్జాతీయ సంస్థలచే ఉగ్రవాద సంస్థగా గుర్తించబడిన పాకిస్తాన్ ఆధారిత ఇస్లామిస్ట్ సంస్థ లష్కరే తోయిబా సహ-స్థాపకుడు.

Exit mobile version