Site icon Prime9

Oxygen Injection: వైద్య శాస్త్రంలో కొత్త ఒరవడి.. ఇంజెక్షన్ ఆక్సిజన్

oxygen-injection

Oxygen Injection: ఆక్సిజన్ మానవాళి మనుగడకు అత్యంత కీలకమైన వాయువు. ఒక్క క్షణం ప్రాణవాయువు లేకుండా మన జీవనాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. అలాంటిది మరి శ్వాసకోశ సమస్యలు, అత్యవసర చికిత్స పొందుతున్న రోగులకు వైద్యులు ఆక్సిజన్ ను సిలిండర్ల ద్వారా అందిస్తుంటారు. ఈ సిలిండర్లను ఒకచోటి నుంచి మరొక చోటికి తీసుకెళ్లడం, దానిని అత్యవసరమైతే అందిచండం కానీ చాలా సమయంతో కూడికున్న పని. మరి దానిని నివారించేందు శాత్రవేత్తలు అనేక ప్రయోగాలు అనంతరం ఇంజెక్షన్ రూపంలో అందించే ఆక్సిజన్ ను కనుగొన్నారు. మరి దాని విశేషాలేంటో చూసేద్దామా..

సాధారణంగా ఆక్సిజన్ సిలిండర్ల రూపంలో రోగికి అందించడం మనం చూస్తూనే ఉంటాం. ఇక శ్వాస తీసుకోలేని రోగులకు ఆక్సిజన్‌ను అందిచడం కొద్దిగా సమయంతో కూడుకున్న పనే. ఆక్సిజన్ అందించే లోపే ప్రాణాలు పోయిన సంఘటనలు లేకపోలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్ అత్యవసరమైన రోగికి నేరుగా రక్తప్రవాహంలోకి అందించే ఇంజెక్షన్‌ను అమెరికా, బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక నివేదికలో పేర్కొన్నారు. తీవ్రమైన శ్వాసనాళాల సమస్య, ఊపిరితిత్తుల వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు ఆక్సిజన్ అత్యవసరమని వైద్యులు పేర్కొన్నారు.

అయితే అనేక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఆఖరికి చిన్న మైక్రోపార్టికల్స్‌తో నిండిన ఇంజెక్షన్‌ను రూపొందించారు. దీనిని నేరుగా రక్తప్రవాహంలోకి అందించడం ద్వారా అవసరమైన ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మైక్రోపార్టికల్స్ ఆక్సిజన్ యొక్క చిన్న పాకెట్ చుట్టూ ఉన్న కొవ్వు అణువుల యొక్క ఒకే పొరతో తయారు చేయబడింది. అవి ద్రవ ద్రావణంలో ఉంచబడి, రోగులలోకి ఇంజెక్ట్ చేయబడతాయని వారు వెల్లడించారు. ఈ ద్రావణాన్ని రోగులకు ఇంజెక్ట్ చేస్తే వారిలోని ఆక్సిజన్ స్థాయిలను సెకన్లలోనే సాధారణ రక్త ఆక్సిజన్ స్థాయికి తీసుకురావచ్చని జాన్ ఖీర్ మరియు బృందం తెలిపారు.

Exit mobile version