Site icon Prime9

ఇరాన్‌: ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ నటి అరెస్టు.. ఆమె చేసిన నేరమేంటి?

Iran

Iran

Iran: దేశవ్యాప్త నిరసనల గురించి తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలపై ఇరాన్ అధికారులు శనివారం దేశంలోని అత్యంత ప్రఖ్యాత నటీమణులలో ఒకరిని అరెస్టు చేసారు. తెలిపింది.ఆస్కార్-విన్నింగ్ చిత్రం “ది సేల్స్‌ మ్యాన్” స్టార్ తారనేహ్ అలిదూస్తీ, ఈ సంవత్సరం సెప్టెంబర్ నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న నిరసనకారులకు అనుకూలంగా ఆమె వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్ తరువాత శనివారం అరెస్టు చేశారు.

నిరసనల సమయంలో చేసిన నేరాలకు ఉరితీయబడిన మొదటి వ్యక్తికి ఆమె సంఘీభావం తెలిపారు. ఆమె తన వాదనలకు అనుగుణంగా ఎలాంటి పత్రాలను అందించలేదు” అని ఇరాన్ మీడియా పేర్కొంది.తన పోస్ట్‌లో, 38 ఏళ్ల అలిదూస్తీ ఇలా చెప్పింది: “అతని పేరు మొహసేన్ షెకారి. ఈ రక్తపాతాన్ని చూస్తూ చర్యలు తీసుకోని ప్రతి అంతర్జాతీయ సంస్థ మానవాళికి అవమానకరం.టెహ్రాన్‌లోని ఒక వీధిని అడ్డుకున్నందుకు మరియు దేశ భద్రతా దళాల సభ్యునిపై కొడవలితో దాడి చేసినందుకు ఇరాన్ కోర్టు అభియోగాలు మోపిన తర్వాత షెకారీని డిసెంబర్ 9న ఉరితీశారు.సెప్టెంబర్ నుండి, అలిదూస్తి ఇన్ స్టాగ్రామ్ లో కనీసం మూడు పోస్ట్‌లలో నిరసనకారులకు బహిరంగంగా సంఘీభావం తెలిపారు. దాదాపు 8 మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్న ఆమె ఖాతా సస్పెండ్ చేయబడింది.

నవంబర్‌లో, సోషల్ మీడియాలో నిరసనకారులకు సంఘీభావం తెలిపినందుకు గాను మరో ఇద్దరు ప్రసిద్ధ ఇరాన్ నటీమణులు హెంగామెహ్ ఘజియానీ మరియు కటయోన్ రియాహిలను అధికారులు అరెస్టు చేశారు. జాతీయ సాకర్ జట్టును అవమానించినందుకు మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు ఇరాన్ సాకర్ క్రీడాకారిణి వోరియా గఫౌరి కూడా గత నెలలో అరెస్టయ్యాడు. తరువాత ముగ్గురిని విడుదల చేశారు.

డ్రస్ కోడ్ ఉల్లంఘించినందుకు మోరాలిటీ పోలీసులకు పట్టుబడిన 22 ఏళ్ల మహిళ మహ్సా అమిని “కస్టడీ మరణం” కారణంగా ఇరాన్ గత మూడు నెలలుగా ఉడికిపోతోంది. అప్పటి నుండి, పురుషులతో సహా ఇరాన్ పౌరులు దేశంలో హిజాబ్ వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.

Exit mobile version