Prime9

Timber Mafia: గాడిదలను కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు.. ఏ దేశంలోనంటే?

Pakistan: ఆ దేశంలో స్మగ్లింగ్ కార్యకలాపాలకు జంతువులే కీలకం. రెండు దేశాల సరిహద్దులో స్మగ్లింగ్ కీలకంగా మారిన ఆ మూగ జంతువులను కోర్టులో ప్రవేశపెట్టిన సంఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకొనింది. సమాచారం మేరకు, పాకిస్థాన్ లోని చిత్రాల్ జిల్లాలో విలువైన కలపను పొరుగు దేశాలకు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసుల తనిఖీల్లో ఓ వ్యక్తితోపాటు 20 గాడిదలు కలపను తరలిస్తూ పట్టుబడ్డాయి. మరో ఇద్దరు నిందుతులు తప్పించుకొని పారిపోయారు. విచారణ అనంతరం గాడిదలను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

వాస్తవానికి పాకిస్థాన్ లో కలప అక్రమ రవాణాకు గాడిదలను ఉపయోగిస్తుంటారు. అది కూడా మనుషులతో పనిలేకుండా తర్ఫీదు ఇచ్చిన గాడిదలపైన కలప దుంగలను పేర్చి మరీ తరలిస్తుంటారు. అధికారులకు పట్టుబడితే తెరవెనుక ఉన్న అక్రమ రవాణా వ్యక్తులు తప్పించుకొనే సులువైన మార్గంలో గాడిదలతో స్మగ్లింగ్ చేయిస్తుంటారు. ఈ క్రమంలో పలు మార్లు అక్రమ రవాణా చేస్తున్న గాడిదలు దొరకడం, వాటిని అటవీ శాఖ సిబ్బందికి అందించడం పోలీసులకు పరిపాటిగా మారింది.

అయితే పట్టుబడ్డ గాడిదలకు ఓ నెంబరును వాటిపైన వేస్తుంటారు. ఈ క్రమంలో గత కేసుల్లో అటవీశాఖ సిబ్బందికి అప్పచెప్పిన గాడిదలు తిరిగి పట్టుబడడంతో వ్యవహారాన్ని కట్టడి చేసేందుకు చిత్రాల్ జిల్లా పోలీసులు కొత్త పంధాను ఎంచుకొన్నారు. అక్రమ రవాణాలో పట్టుబడిన గాడిదల లెక్క తేలాలంటే వాటిని కోర్టులో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకొన్నారు. ఇక పై అవే గాడిదలు తిరిగి పట్టుబడితే గాడిదలు తప్పిపోవడంలో ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొనే క్రమంలో వాటిని కోర్టులో ప్రవేశపెట్టారు.

పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో గాడిదల పై జరిగే కలప స్మగ్లింగ్ గాడిదలతోపాటుగా ట్రక్కుల్లో కూడా పలు మార్గాల ద్వారా స్మగ్లింగ్ చేస్తుంటారు.

ఇది కూడా చదవండి: Liz Truss Resigns: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా

Exit mobile version
Skip to toolbar