Site icon Prime9

Kim Jong Un: తొలిసారి కుమార్తెను ప్రపంచానికి చూపించిన కిమ్ జోంగ్

Kim Jong Un

Kim Jong Un

North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌ మొట్టమొదటిసారి తన కుమార్తెను బాహ్య ప్రపంచానికి పరిచయం చేశాడు. తన కుమార్తె చేయి పట్టుకొని క్షిపణులను పరిశీలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం షోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా శుక్రవారం నాడు ఉత్తర కొరియాతో హ్వసాంగ్‌ 17 ఇంటర్ కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు ఉత్తర కొరియాకు చెందిన ప్రభుత్వ వార్త సంస్థ కెసీఎన్‌ఏ వెల్లడించింది. అయితే కిమ్‌ కుమార్తె పేరు మాత్రం ఆ వార్త సంస్థ వెల్లడించలేదు. కిమ్‌ కుమార్తె తెల్లటి వైట్‌ పుప్పీ కోట్‌ ధరించి తన తండ్రి చేయి పట్టుకొని భారీ క్షిపణిని పరిశీలించింది.

కిమ్‌ కుమార్తెను ఇలా బహిరంగంగా చూడటం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. కిమ్‌ తన కుమార్తెను ఇలా బహిరంగంగా బయటకు తీసుకురావడం పట్ల చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కిమ్‌కు ముగ్గురు సంతానం ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఉత్తర కొరియా జాతీయ సెలవు దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో ఈ అమ్మాయి ఒక ఫుటేజీలో కనిపించిందంటున్నారు.

2013లో రిటైర్డ్‌ అమెరికన్‌ బాస్కెట్‌బాల్‌ స్టార్‌ డెన్నిస్‌ రాడ్‌మాన్‌ కిమ్‌ కుటుంబ వివరాలు వెల్లడించారు. ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లిప్పుడు కిమ్‌ కుటుంబంతో కొంత సమయం గడిపినట్లు ఆయన గార్డియన్‌ న్యూస్‌ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కిమ్‌ కుమార్తె పేరు జు ఏయి అని చెప్పారు. ఆ అమ్మాయిని తాను ఎత్తుకున్నానని కూడా చెప్పాడు. జుఏ వయసు సుమారు 12-13 సంవత్సరాలు ఉండవచ్చునని, వచ్చే నాలుగు లేదా ఐదు సంవత్సరాల్లో ఆమె యూనివర్శిటీకి వెళ్లాల్సి రావచ్చు. లేదా మిలిటరీ సర్వీసెస్‌కు అయినా వెళ్లాల్సి రావచ్చునని ఉత్తర కొరియా నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version