Site icon Prime9

North Korea President Kim Jong Un: రూ.5 లక్షల విలువైన లిక్కర్ తాగుతున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌

Kim Jong Un

Kim Jong Un

North Korea President Kim Jong Un: ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అయినా ఆ దేశ నియంత అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ విలాసాలు ఏమాత్రం తగ్గడం లేదు. కిమ్‌ విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు బ్రిటన్‌కు చెందిన రక్షణ రంగ నిపుణులు ఓ పత్రికకు వెల్లడించారు. కాగా కిమ్‌ 7,000 డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 5 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే హెన్నెస్సీ మద్యాన్ని తాగుతాడని పేర్కొన్నారు. అతనికి అవసరమైన విలాసవంతమైన మద్యం బ్రాండ్ల దిగుమతికే ఏటా 30 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు 247 కోట్ల రూపాయలు వెచ్చిస్తారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం చైనా జనరల్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ బహిర్గతం చేసినట్లు తెలిపారు.

ఇక కిమ్‌కు ఇష్టమైన బ్రెజిలీయన్‌ కాఫీ కోసం ఏటా 9.6 లక్షల డాలర్లను వెచ్చిస్తున్నారు. అతడు తాగే సిగిరెట్లు ప్రత్యేకమైన బంగారపు రేకుతో చుట్టి ఉంటాయని పేర్కొన్నారు. ఇంతేకాదు.. కిమ్‌ మద్యంతోపాటు తినేందుకు ఇటలీలో ప్రత్యేకంగా తయారు చేసే పర్మా హామ్‌ -పోర్క్‌తో తయారు చేసేది, స్విస్‌ చీజ్‌ను ఉత్తర కొరియా దిగుమతి చేసుకొంటోంది. ఈ విషయాన్ని ఒకప్పటి కిమ్‌ చెఫ్‌ యూకేకు చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

లైంగిక సామర్ద్యానికి స్నేక్ వైన్..( North Korea President Kim Jong Un)

గతంలో కూడా కిమ్‌, అతడి తండ్రి కలిసి కొబే స్టీక్స్‌, క్రిస్టల్‌ షాంపైన్‌తో ఆహారం తీసుకొనేవాడని అతడి వద్ద పనిచేసిన వారు వెల్లడించారు. 1997లో కిమ్‌ కోసం పిజ్జాలు చేసేందుకు ఇటలీ నుంచి ప్రత్యేకంగా ఓ చెఫ్‌ను రప్పించారు. 2014లో కిమ్‌ లైంగిక సామర్థ్యం పెరిగేందుకు ఖరీదైన స్నేక్‌ వైన్‌ తాగేవాడని తెలిసింది. గతంలో కిమ్‌ 136 కిలోల బరువు దాటిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్‌ సంస్థ పరిశోధనల్లో కిమ్‌ ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై సమర్పించిన నివేదికలో వెల్లడించింది. అమెరికా నుంచి మార్ల్‌బోరో సిగరెట్లు, నిద్రలేమికి చికత్స చేసే జిల్పీడెమ్‌ వంటి వాటిని దిగుమతి చేసుకొనేవారు.

కరోనా అనంతరం ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొన్నట్టు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే. పొరుగు దేశమైన చైనా నుంచి ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన పరికరాలతోపాటు ధాన్యాల దిగుమతి కూడా నిలిపేసింది. దీంతో 2.6 కోట్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో పంట దిగుబడి లేక ఆహార సంక్షోభం మొదలయింది.

Exit mobile version