Site icon Prime9

Missiles: దక్షిణ కొరియా సముద్ర జలాల్లో 17 క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా

missiles

missiles

South Korea: ఉత్తర కొరియా మరోసారి దక్షిణ కొరియాను రెచ్చగొట్టింది. ఏకంగా 17 క్షిపణులను దక్షిణ కొరియా సముద్ర జలాల్లో ప్రయోగించింది. తమ భూభాగాలను ఆక్రమించడానికి కిమ్‌ కుట్రపన్నుతున్నారని ఆరోపించారు దక్షిణ కొరియాప్రెసిడెంట్‌ యూన్‌ సుక్‌ యెల్‌. ప్రతీకారంగా సియెల్‌ కూడా ఉత్తర కొరియా సముద్ర జలాల్లో క్షిపణులతో దాడులు చేసింది. ఉత్తర కొరియాకు సియోల్‌ గట్టి సవాలు విసిరిందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉత్తర కొరియా అకస్మాత్తుగా క్షిపణులతో దాడులకు పాల్పడ్డానికి ప్రధాన కారణం అమెరికా, దక్షిణ కొరియాలు కలిసి సంయుక్తంగా సైనిక కవాతు నిర్వహించడం ఉత్తర కొరియాకు కంటగింపు కలిగించింది.

ఇదిలా ఉండగా ఉత్తర కొరియా పేల్చిన షార్ట్‌ రేంజి బాల్లిస్టిక్‌ మిస్సైల్‌ దక్షిణ కొరియాలోని ఉల్లెంగ్డో దీవి సమీపంలో పడింది. దీంతో అక్కడ నివాసం ఉన్న వారిని తక్షణమే అక్కడి బంకర్లలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వం సూచించింది. 1953లో కొరియా యుద్ధం ముగిసిన తర్వాత ఈ స్థాయిలో మళ్లీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులు నేరుగా దక్షిణ కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి. దక్షిణ కొరియా ప్రెసిడెంట్‌ యూన్‌ మాత్రం ఉత్తర కొరియా కావాలనే తమను రెచ్చగొడుతోందన్నారు. క్షిపణుల దాడి ద్వారా తమ భూభాగాలను స్వాధీనం చేసుకోవాలనుకుంటోందని ప్రెసిడెంట్‌ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి 57 కిలోమీటర్ల దూరంలోని తూర్పు మెయిన్‌లాండ్‌లో పడింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని ఆయన అన్నారు. కాగా పది షార్ట్‌రేంజి బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ తమపై ప్రయోగించిందని సియోల్‌ మిలిటరీ అధికారులు చెప్పారు. చినికి చినికి గాలివానగా మారి అణు యుద్ధానికి దారితీసినా తాను ఆశ్చర్యపోనని వార్‌ వెటరన్స్‌ అభిప్రాయపడుతున్నారు. దక్షిణ కొరియా కూడా మూడు ఎయిర్‌ టూ గ్రౌండ్‌ మిస్సైల్స్‌ను ఇరు దేశాల సముద్ర జలాలను విభజించే ప్రాంతాల్లో ప్రయోగించినట్లు తెలిపింది. సంఘటన జరిగిన వెంటనే ప్రెసిడెంట్‌ యూన్‌ అత్యవసరంగా నేషనల్‌ సెక్యూరిటీ గార్డు కౌన్సిల్‌తో సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్తర కొరియా దుందుడుకు చర్యకు గట్టిగా బుద్ది చెప్పాలని ఆదేశించారు.

Exit mobile version