Site icon Prime9

Nigeria killings: నైజీరియాలో సాయుధమూకల కాల్పులు.. 40 మంది మృతి

Nigeria killings

Nigeria killings

 Nigeria killings: నైజీరియాలో దారుణంగా చోటు చేసుకుంది. ఉత్తర మధ్య పీఠభూమిలో జురాక్‌ గ్రామంలో తుపాకీ ధరించిన ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 40 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. కాగా ఈ ప్రాంతంలో రైతులకు .. పశువుల కాపర్లకు ఎప్పుడు ఘర్షణలు జరుగుతుంటాయని పోలీసు అధికారి ప్రతినిధి అల్ఫ్రుడ్‌ అల్బో చెప్పారు. జురాక్‌, డాకై గ్రామానికి చెందిన పౌరులు గన్‌మెన్‌ చేతిలో బలికాగా పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉండగా ఈ సంఘటన జరగడానికి ముందు భద్రతాదళాలకు స్థానికుల మధ్య జరిగిన కాల్పుల్లో మరో ఏడుగురు మృతి చెందారు. భద్రతా దళాల కాల్పులకు గ్రామస్తులు పారిపోగా.. ఆరు ఇళ్లను భద్రతాదళాలు తగులబెట్టారు.

విచక్షణరహితంగా కాల్పులు..( Nigeria killings)

అయితే స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం .. తుపాకులు ధరించిన పలువురు గ్రామాల్లోకి మోటార్‌సైకిళ్లపై వచ్చి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. కొంత మందిని కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లారు. కొన్ని ఇళ్లను తగులబెట్టారు. తుపాకులు ధరించిన సాయుధులు గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే కనిపించిన వారిపై కాల్పులు జరుపడం మొదలుపెట్టారు. సుమారు 40 మంది చనిపోయి ఉంటారని తాను తప్పించుకువచ్చానని జురాక్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి చెప్పాడు. అయితే తన కుటుంబం ఎక్కడుందో అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు.

గత కొన్ని సంవత్సరాల నుంచి ఉత్తర నైజీరియాలోని గ్రామీణ ప్రాంతాల్లో దాడులు కిడ్నాప్‌లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆయుధాలు ధరించిన ముఠాలు గ్రామాలపై పడి, స్కూళ్లు, ప్రయాణికులపై పడి అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రస్తుతం నైజీరియాలోని ఈశాన్య ప్రాంతంలో ఇస్లామిస్ట్‌లు పెద్ద ఎత్తున దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అదే సమయంలోఆగ్నేయ నైజీరియాలో, సెంట్రల్‌ నైజీరియాలో పశువుల కాపర్లకు.. రైతులకు మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా పోలీసులు ఈ రెండు కమ్యూనిటీలను సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి.

Exit mobile version