Site icon Prime9

Nigeria: నైజీరియాలో ఉగ్రవాదుల దాడిలో 21 మంది సైనికుల మృతి

Nigeria

Nigeria

Nigeria:  బుర్కినా ఫాసోతో ఉన్న సరిహద్దు సమీపంలో ఉగ్రవాద బృందంఆకస్మికంగా దాడి చేసి 21 మంది నైజీరియన్ సైనికులను చంపినట్లు నైజర్ పాలక మిలిటరీ జుంటా ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం జరిగిన ఈ దాడి వెనుక ఏ గ్రూపు ఉందో పేర్కొనలేదు.

ఇస్లామిక్ తీవ్రవాదంతో..(Nigeria)

గత వారం లిబరేషన్ ఫ్రంట్ చైనా సహకారంతో నిర్మితమవుతున్న పైప్‌లైన్‌పై దాడి చేసింది. చైనాతో $400 మిలియన్ల ఒప్పందాన్ని రద్దు చేయకపోతే మరిన్ని దాడులు చేస్తామని బెదిరించింది. మాజీ తిరుగుబాటు నాయకుడు సలాహ్ మహమూద్ నేతృత్వంలోని సమూహం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దె దింపడం ద్వారా జుంటా అధికారం చేపట్టింది.మాలి, బుర్కినా ఫాసోలు కూడా జుంటాల నేతృత్వంలో ఉన్నాయి.నైజర్, మాలి, బుర్కినా ఫాసోలు అల్-ఖైదా మరియు ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సమూహంతో ముడిపడి ఉన్న ఉద్యమాలతో పోరాడుతున్నాయి. ఇక్కడ చెలరేగిన హింసతో గత సంవత్సరం వేలాది మంది చినపోగా 2 మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.

అమెరికాసైనిక కార్యకలాపాలలో నైజర్ కీలకం. ఇక్కడ తీవ్రవాద గ్రూపులను అణచివేయడానికి, స్థానిక ప్రభుత్వాలకు సహాయం చేయడానికి అమెరికా ప్రయత్నించింది. నియామీకి 920 కిలోమీటర్ల దూరంలోని అగాడెజ్‌లో ఇటీవల నిర్మించిన ఎయిర్‌బేస్‌లో 650 మంది అమెరికా దళాలు, వందలాది మంది సహాయక సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే గత వారం, నైజర్ యొక్క పాలక జుంటా ఇకపై అక్కడ యుఎస్ ఉనికిని గుర్తించలేదని చెప్పింది.

Exit mobile version
Skip to toolbar