New York people: కెనడా అడవిలో ఏర్పడ్డ కార్చిచ్చు దానావలంలా ఆ పొగ కాస్తా న్యూయార్కు గగనతలంలోకి రావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలోని పలు రాష్రఆకాశం ఆరేంజి కలర్‌లోకి మారిపోయింది. అయితే కెనడా అధికారుల సమాచారం ప్రకారం కెనడాలో మంటలను ఆర్పడానికి ఫైర్ ఫైటర్స్ చెమటోడ్చుతున్నారు. కెనడాలోని 8.7 మిలియన్ ఎకరాల అడవిలో ఏర్పడ్డ కార్చిచ్చుకు ఆ మంటల పొగ నేరుగా అమెరికా వైపు దూసుకురావడంతో ఇక్కడి అమెరికా ప్రజలు సతమతమవుతున్నారు. అమెరికాలోని వెర్మాంట్ స్టేట్ కంటే పెద్దదైన అడవి నుంచి విషతూల్యమైన గాలి అమెరికా వైపువస్తోంది.
విమాన సర్వీసులు రద్దు..( New York people)
కెనడా నుంచి వస్తున్న దట్టమైన పొగకు న్యూయార్కునుంచి ఇతర దేశాలకు .. దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. బుధవారం నాడు ఆకాశం మొత్తం ఆరెంజి రంగుగా మారిపోయి కనిపించింది. అమెరికా తూర్పుప్రాంతంలో నివాసం ఉంటున్న సుమారు 75 మిలియన్ ప్రజలను ఎయిర్ క్వాలిటి అలెర్ట్‌ను ప్రకటించారని సీఎన్‌ఎన్ తెలిపింది. ప్రస్తుతం న్యూయార్కులో మాత్రం పరిస్థితి దారుణంగా తయారైంది. కెనడా నుంచి వస్తున్న విషతూల్యమైన పొగకు న్యూయార్కు విమానాశ్రయంలో విమాన సర్వీసులు ఆలస్యంగా నడవడమో లేదా రద్దు చేయడం జరిగిపోయాయి. నెవార్క్ నుంచి ఫెలడెల్పియాకు వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సుమారు 4,800 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. ఈ వారాంతంలో జరగాల్సిన హార్స్ రేసింగ్‌ను రద్దు చేయాలని పేటా నిర్వాహకులను కోరింది. దట్టమైన పొగకు… ప్రమాదకరమైన పార్టికల్స్ వల్ల జంతువులకు ప్రమాదం పొంచి ఉంటుంది పెటా ఒక ప్రకటనలో నిర్వాహకులను హెచ్చరించింది.
మంటలను ఆర్పడానికి ఫైర్ ఫైటర్స్ ..
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడోతో కెనడా అడవిలో చోటు చేసుకున్న కార్చిచ్చు గురించి చర్చించారు. ఇప్పటికే అమెరికా 600 ఫైర్ ఫైటర్స్‌ను మంటలను ఆర్పడానికి కెనడాకు పంపించింది. మంటలను ఆర్పడానికి మరింత మందిని పంపడానికి సంసిద్దను వ్యక్తం చేసినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా న్యూయార్కులో పలు బ్రాడ్‌వే షోలు కూడా రద్దు అయ్యాయి. వాటిలో హామిల్టంన్, షెక్‌స్పీయర్ ఇన్ ది పార్క్,కెమెలాంట్ షోలు రద్దు అయ్యాయి. అయితే న్యూయార్కు నగరంలోని పౌరులు మాత్రం అధికారులపై ఆగ్రహంతో ఉన్నారు. కెనడాలో కార్చిచ్చు తర్వాత వెంటనే తమను ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరిస్తే బాగుండేదనిమధ్యాహ్నం నుంచి న్యూయార్కు గగనతలంలో దట్టమైన పొగ కమ్ముకోవడం మొదలైతే రాత్రి 11.30 గంటలకు ఈ వార్తను ప్రజలకు తెలియజేశారు.ఇంత ఆలస్యంగా సమాచారం ఇవ్వడం పట్ల ప్రజలు అధికారులపై అసంతృప్తితో ఉన్నారు. న్యూయార్కు లోని పబ్లిక్ స్కూళ్లు ఔట్‌డోర్ కార్యక్రమాలను రద్దు చేశాయి. ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావాలని సూచించింది.
ప్రమాదకరస్థాయికి ఎయిర్ క్వాలిటీ..
న్యూయార్కు ప్రజలకు క్వాలిటీ హెల్త్ అడ్వయిజరీ నోట్‌ను విడుదల చేసింది. నగరంలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకరస్థాయికి చేరుకుందని హెచ్చరించింది. ఎన్‌వైసీ మెట్రో, లాంగ్ ఐలాండ్, ఈస్ర్టన్ లేక్ ఒంటారియో. సెంట్రల్ అండ్ వెస్ర్టన్ ఎన్‌వైలలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా తయారైందని న్యూయార్కు ఎన్విరాన్‌మెంటల్ కన్సర్వేషన్ ట్విట్‌లోపేర్కొంది. ఇక న్యూయార్కులోని ఎయిర్‌క్వాలిటీ ర్యాంకింగ్ మాత్రం అధ్వాన్నంగా తయారైంది. బుధవారం నాడు న్యూయార్కు లో ఎయిర్ క్వాలిటి 392 మార్కుకు చేరింది. ప్రపంచంలోనే అత్యంత దారుణంగా ఉంది ఇక్కడి ఎయిర్ క్వాలిటి. న్యూయార్కులో జరగాల్సిన ఎంఎల్‌బీ గేమ్స్ గురువారానికి వాయిదా పడ్డాయి. బుధవారం రాత్రి వైట్ సాక్స్, యాంకీకి జరగాల్సిన గేమ్ కూడా గురువారానికి వాయిదా పడింది. ఇదిలా ఉండగా న్యూయార్కు గవర్నర్ కేథి హోచల్ గురువారం పది లక్షల ఎన్ 95 మాస్క్‌లు పంచిపెడతామని ప్రకటించారు.