Netflix: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. అకౌంట్ హోల్డర్స్ ను ఆకట్టుకోవడానికి ఈజిప్టు, యెమెన్, లిబియా, ఇరాన్, కెన్యా, క్రొయేషియా, బల్గేరియా, నికరాగ్వ, ఈక్వెడార్, మలేసియా, ఇండోనేసియా, వియత్నాం, థాయ్‌లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ ఫీజును భారీగా తగ్గించింది.
30కి పైగా దేశాల్లో ఈ తగ్గింపులు ఉన్నాయి. ఇండియాలో గత కొంతకాలంగా ఓటీటీలు ఆదరణ పొందుతున్నా.. భారత్ లో మాత్రం ఛార్జీలను తగ్గించకపోవడం గమనార్హం
కొన్ని దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ఆదరణ కోల్పోతోంది. చందాదారులు భారీగా తగ్గిపోతుండటంతో సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా, సబ్ సహారన్ ఆఫ్రికా , మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా, సెంట్రల్ అండ్ ఈస్ట్రన్ యూరప్ , ఏసియా పసిఫిక్ లాంటి రీజియన్స్‌లో ఛార్జీలను బాగా తగ్గించింది.
ఖాతాదారుల సంఖ్య పెంచుకోవడానికి సబ్ స్క్రిఫ్షన్ ఫీజుపై దాదాపుగా 20 శాతం నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్స్ ఇస్తోంది.
అందుకు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘ప్రతి నెల నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌ను 28 మలేసియన్ రింగిట్స్‌కే అందివ్వనున్నాం.
ఈ ఆఫర్ ప్రస్తుత చందాదారులతో పాటు కొత్తగా చేరాలనుకునే వారికి అందుబాటులో ఉంటుంది’ అని నెట్ ఫ్లిక్స్ చెప్పింది.
గతంలో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ బేసిక్ ధర 35 మలేసియన్ రింగిట్స్ ఉండేది.
గతంలో నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను లాటిన్ అమెరికాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు అక్కడ విజయవంతం కావడంతో మరికొన్ని దేశాలకు విస్తరించింది.
కెనడా, న్యూజిలాండ్, స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాల్లో ఈ స్కీం ను అమలు చేసింది.
ప్రస్తుతం ఆ దేశంలోని చందాదారులకు పాస్‌వర్డ్ షేరింగ్ ఫీచర్‌ను నెట్ ఫ్లిక్స్ తీసివేసింది. అయినా, వారు తమ నెట్‌ఫ్లిక్స్ ప్రొఫైల్ అకౌంట్‌ను మాత్రం ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
ప్రస్తుత వినియోగదార్లు అకౌంట్‌ను బదిలీ చేస్తే వారి రికమండేషన్స్, హిస్టరీ, మై లిస్ట్, సేవ్డ్ గేమ్స్‌తో సహా మరికొన్ని కొత్త అకౌంట్స్ హోల్డర్స్ చూసే అవకాశం ఉంది.