Site icon Prime9

Narendra Modi-Joe Biden: నరేంద్ర మోదీ ఆటోగ్రాఫ్ అడిగిన అమెరికా అధ్యక్షుడు

Joe Biden-Narendra Modi

Joe Biden-Narendra Modi

Narendra Modi-Joe Biden: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం జీ 7 సమ్మిట్ లో భాగంగా జపాన్ లోని హిరోషిమాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వివిధ దేశాల అధినేతలతో మోదీ వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చంది. స్వయంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని మోదీని ఆటోగ్రాఫ్ అడినట్టు తెలుస్తోంది.

 

మోదీతో ముచ్చటించిన బైడెన్(Narendra Modi-Joe Biden)

జీ7 సదస్సులో భాగంగా జో బైడెన్ మోదీతో కాసేపు వ్యక్తిగతంలో మాట్లాడారు. ఈ క్రమంలో బైడెన్ తనకు ఎదురైన సంఘటనలను మోదీతో ముచ్చటించారట. వచ్చే నెలలో బైడెన్ ఆహ్వానంతో వచ్చే నెలలో మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అయితే, మోదీ పాల్గోనే సమావేశంలో హాజరయ్యేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని బైడెన్ అన్నారట. తనకు అనేక వర్గాల నుంచి ప్రెషర్స్ వస్తున్నాయని బైడెన్ తెలిపారట. తనకు పరిచయం లేని వ్యక్తులు కూడా మోదీని కలిసే అవకాశాన్ని కల్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నారని మోదీ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.

 

చాలా పెద్ద సమస్యను సృష్టించారు: జో బైడెన్

మోదీ, బైడెన్ మాట్లాడుకే సమయంలోనే అక్కడికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్ కూడా తనకు ఎదురైన వాటిని ఇరువురుతో పంచుకున్నారని తెలిసింది. సిడ్నీలో జరిగే ఓ కార్యక్రమానికి మోదీ రానున్నారని.. అక్కడి వెళ్లేందుకు అవకాశం కల్పించాలని తనకు చాలామంది సందేశాలు పంపుతున్నారని ఆల్బనీస్ అన్నారట. అయితే మోదీ కార్యక్రమానికి 20 వేల మందికి మాత్రమే పర్మిషన్ ఉందని చెప్పినా.. ఇంకా పాస్ ల కోసం రిక్వెస్టులు వస్తూనే ఉన్నాయని తెలిపారని వారి మాటలు విన్నవారు తెలిపారని విశ్వసీయవర్గాల సమాచారం.

ఇంతలో కలుగుజేసుకున్న అగ్రదేశాధినేత బైడెన్‌ ‘మీరు నిజంగా చాలా పెద్ద సమస్యను సృష్టించారు’ అని మోదీని ఉత్తేశించి సరదాగా అన్నారట. ఈ క్రమంలోనే ‘నేను మీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలి’ అని మోదీతో బైడెన్ అన్నారట. దీంతో ముగ్గురు నేతలు నువ్వుతూ కనిపంచారని సమాచారం.

 

 

మరెన్నో ఆసక్తికరమైన ఘటనలు

కాగా, జీ7 సదస్సులో మరెన్నో ఆసక్తికరమైన ఘటనలు జరిగాయి. ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీ దగ్గరికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రావడం చూసిన మోదీ కుర్చీలోంచి లేచి స్వాగతించారు. ఇద్దరూ పలకరించుకొని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ను కూడా మోదీ ఆప్యాయంగా కౌగిలించుకొని మాట్లాడారు. మరోవైపు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌తో ద్వైపాక్షిక అంశాలపై కూడా మోదీ చర్చించారు.ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తర్వాత మోదీ తొలిసారిగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. జీ7 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కరచాలనం చేసుకొని ఫొటోలకు పోజులిచ్చారు. ఉక్రెయిన్‌ యుద్ధం మానవత్వం, మానవ విలువలకు సంబంధించినదని మోదీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

 

Exit mobile version