Nagorno-Karabakh: అజర్‌బైజాన్‌లోని నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంలోని గ్యాస్ స్టేషన్లో జరిగిన పేలుడులో 20 మంది మరణించగా 300 మందిగాయపడ్డారు. వేర్పాటువాద అధికారులు ఈ ప్రాంతం యొక్క అధికారాన్ని అజర్‌బైజాన్‌కు అప్పగించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇది జరిగింది. గాయపడిన వారిలో పలువురి పరిస్దితి ఇంకా విషమంగానే ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.
అర్మేనియాకు పారిపోవాలని కోరుతున్న ప్రజలు ఇంధనం కోసం బారులు తీరడంతో గ్యాస్ స్టేషన్‌లో పేలుడు సంభవించింది.మూడు దశాబ్దాల వేర్పాటువాద పాలనను అనుసరించి అజర్‌బైజాన్ సైన్యం ఈ ప్రాంతాన్ని పూర్తిగా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వేగవంతమైన ఆపరేషన్‌ను ప్రారంభించిన తర్వాత వేలాది మంది నగోర్నో-కరాబాఖ్ నివాసితులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆర్మేనియాకు పారిపోతున్నారు. అజర్‌బైజాన్ ఈ ప్రాంతంలోని జాతి అర్మేనియన్ల హక్కులను గౌరవిస్తామని,సరఫరాలను తిరిగి పునరుద్దరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అనేక మంది స్థానికులు ప్రతీకార చర్యలకు భయపడి అర్మేనియాకు పారిపోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సాయంత్రం వరకు 6,500 మంది నగోర్నో-కరాబాఖ్ నివాసితులు ఆర్మేనియాలోకి ప్రవేశించారు. నాగోర్నో-కరాబాఖ్‌లోని రష్యా శాంతి పరిరక్షకులు తరలింపునకు సహకరిస్తున్నారని మాస్కో తెలిపింది. సోమవారం రాత్రికి దాదాపు 700 మంది శాంతి భద్రతల శిబిరంలో ఉన్నారు.