Moracco Earthquake : ఆఫ్రికా లోని మొరాకోలో భారీ భూకంపం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న భారీ భూకంపంలో ఇప్పటి వరకు 820 మంది మృతి చెందగా.. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. వందల sది మంది గాయాలపాలయ్యారు. సెంట్రల్ మొరాకలో 6.8 తీవ్రతతో ఈ భూకంపం చోటు చేసుకుంది. మొరాకో ఇంటీరియర్ మినిస్ట్రీ నివేదిక ప్రకారం నగరాల వెలుపల చిన్న పట్టణాల్లో ఎక్కువ నష్టం జరిగినట్లు గుర్తించింది. అయితే.. ఈ భూకంప నష్టాన్ని అధికారులు ఇంకా అంచనా వేయాల్సి ఉన్నది.
భూకంప కేంద్రం అట్లాస్ పర్వాతల్లో, మారకేశ్‌కు నైరుతి వైపుగా 71 కిలోమీటర్ల దూరంలో, 18.5 కిలోమీటర్ల లోతులో ఉన్నాయని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూమి కంపించగానే ప్రజలు భయంతో బయటకు పరుగుపెట్టారు. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భవనాలు, రిసార్టులు, హోటళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగుతీశారు. ఆ భయానక క్షణాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
కాగా భూకంపం కారణంగా మృతులకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘‘మొరాకోలో భూకంపం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధపడ్డాను. ఈ విషాద సమయంలో మొరాకో ప్రజలకు అండగా ఉంటాను మృతులకు సంతాపం, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ఈ కష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందిని రాసుకొచ్చారు.