Mark Zuckerberg: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మూడో సారి తండ్రి అయ్యాడు. జుకర్ బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా, మూడో సారి తండ్రి అయిన సంతోషాన్ని జకర్ బర్గ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘లిటిల్ బ్లెస్సింగ్..అరేలియా చాన్ కి స్వాగతం ’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఈ మేరకు కుమార్తెను ఫోటోను ఆయన షేర్ చేశారు. ఈ పోస్ట్ కు మిలియన్ పైగా లైక్స్.. అభినందనలు వచ్చాయి.
మిలియన్ పైగా లైక్స్.. అభినందనలు(Mark Zuckerberg)
కాగా, కొత్త ఏడాది సందర్బంగా .. తనకు పాప పుడుతుందని జుకర్ బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రిసిల్లా చాన్ మూడోసారి ప్రెగ్నెంట్ అయిందని, మ్యాక్స్, ఆగస్ట్ (కుమార్తెలు) కు వచ్చే ఏడాది ఓ చెల్లి రాబోతోందంటూ అని తన భార్యతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారాయన. హార్వర్డ్ యూనివర్సిటీలో కలుసుకున్న ప్రిసిల్లా చాన్,జుకర్‌బర్గ్.. 2003 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. తర్వాత ఈ జంట 2012 లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరి అమ్మాయిలకు జన్మనిచ్చింది ఈ జంట. ఇటీవలే పదో వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపు కున్నారు.