Site icon Prime9

Pakistan: పాకిస్తాన్ లో మొట్టమొదటి హిందూ మహిళా డీఎస్పీగా మనీషా రోపేటా

Pakistan

Pakistan

 Pakistan: పాకిస్థాన్ లోని సింధ్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా మొదటి హిందూ మహిళ మనీషా రోపేటాను నియమించారు.రోపెటా పాకిస్తాన్ యొక్క పితృస్వామ్య అడ్డుగోడలను బద్దలు కొట్టడమే కాకుండా, 26 సంవత్సరాల వయస్సులో అధికార పదవిలో నియమితులైన మొదటి హిందూ మహిళగా కూడా రికార్డు సృష్టించారు.

మహిళా రక్షకులు అవసరం..( Pakistan)

మనీషా రోపేట సింధ్‌లోని జాకోబాబాద్‌లో స్థిరపడిన మధ్యతరగతి కుటుంబానికి చెందినది. బాలికలు మరియు మహిళలు పోలీసు ఫోర్స్ లేదా జిల్లా కోర్టులలో ఉద్యోగాలకోసం కలలు కనకూడదనే నమ్మకాన్ని అంతం చేయడమే ఆమె నినాదం.మన సమాజంలో మహిళలు అత్యంత అణచివేతకు గురవుతున్నారు . పలు నేరాలకు లక్ష్యంగా ఉన్నారు.మన సమాజంలో మనకు మహిళా రక్షకులు అవసరమని నేను భావిస్తున్నాను కాబట్టి నేను పోలీసు శాఖలో చేరాను అంటూ మనీషా చెప్పారు. మనీషా రోపేట తండ్రి జాకోబాబాద్‌లో వ్యాపారి. అతని మరణం తరువాత ఆమె తల్లి పిల్లలను కరాచీకి తీసుకువచ్చింది.ఆమెకు నలుగురు తోబుట్టువులు ఉన్నారు. ముగ్గురు సోదరీమణులు మరియు ఒక సోదరుడు .వీరంతా వైద్య వృత్తిలో ఉన్నారు. ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షల్లో కేవలం ఒక్క మార్కుతో ఫెయిల్ కావడంతో మనీషా రోపేటకు డాక్టర్ కావడానికి అవకాశాలు లేకుండా పోయాయి. నేను ఫిజికల్ థెరపీలో డిగ్రీ తీసుకుంటున్నానని నా కుటుంబానికి చెప్పాను. కానీ అదే సమయంలో నేను సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ పరీక్షలకు సిద్ధమయ్యాను. 468 మంది అభ్యర్థులలో 16వ స్థానంలో ఉత్తీర్ణత సాధించాను అని మనీషా చెప్పింది.

Exit mobile version