Site icon Prime9

Mali: మాలిలోని బంగారుగనిలో సొరంగం కూలి 73 మంది మృతి.

Mali

Mali

Mali: మాలిలోని బంగారుగనిలో సొరంగం కూలి 70 మందికి పైగా మరణించారని స్థానిక స్థానిక అధికారి బుధవారం తెలిపారు. గత వారం జరిగిన ఈ ప్రమాదసమయంలో 200 మందికి పైగా కార్మికులు ఉన్నారని చెప్పారు. 73 మృతదేహాలను కనుగొన్నామంటూ బంగారు గనుల అధికారి ఓమర్ సిడిబే తెలిపారు.

 బంగారం ఉత్పత్తిలో ఫస్ట్.. (Mali)

మాలి గనుల మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పలువురు మైనర్లు మరణించినట్లు ప్రకటించింది కానీ వారి గురించి ఖచ్చితమైన గణాంకాలను ఇవ్వలేదు.మైనింగ్ సైట్లు సమీపంలో నివసించే సంఘాలు భద్రతా అవసరాలను పాటించాలని నిర్ణీత పరిధులలో మాత్రమే పని చేయాలని సూచించింది.ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉన్న మాలి, ఆఫ్రికాలో బంగారం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది.గోల్డ్ మైనింగ్ సైట్లలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణంగా మారింది. మాలి 2022లో 72.2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది.  ఇది జాతీయ బడ్జెట్‌లో 25 శాతం, ఎగుమతి ఆదాయాల్లో 75 శాతం మరియు జిడిపిలో 10 శాతంగా ఉంది.

Exit mobile version