Site icon Prime9

Lunar-eclipse: నేడు చంద్ర గ్రహణం.. ఎక్కడ కనిపిస్తుందంటే?

eclipse

eclipse

Lunar-eclipse: నేడు ఖగోళంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ సంవత్సరంలో ఇదే మెుదట చంద్రగ్రహణం కానుంది. శుక్రవారం సాయంత్రం.. అద్భుత దృశ్యం ఏర్పడనుంది. ఇదే రోజు బుద్ద పూర్ణిమా కావడం కూడా గమనర్హం. బుద్ధ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ రోజున నిర్వహిస్తారు.

నేడు చంద్రగ్రహణం..

నేడు ఖగోళంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ సంవత్సరంలో ఇదే మెుదట చంద్రగ్రహణం కానుంది. శుక్రవారం సాయంత్రం.. అద్భుత దృశ్యం ఏర్పడనుంది. ఇదే రోజు బుద్ద పూర్ణిమా కావడం కూడా గమనర్హం. బుద్ధ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ రోజున నిర్వహిస్తారు.

పెనుంబ్లార్‌ లూనార్‌ గా చంద్రగ్రహణం ఏర్పడనుందని.. ప్లానెటరీ సొసైటీ, ఇండియా డైరెక్టర్‌ ఎన్‌.శ్రీరఘునందన్‌కుమార్‌ తెలిపారు. భారత కాలమాన ప్రకారం.. ఇది శుక్రవారం రాత్రి 8:42 నుంచి 1:04 వరకు ఉంటుందని తెలిపారు. కానీ ఈ చంద్ర గ్రహణం భారత్ లో కనిపించదని తెలిపారు. కేవలం ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అట్లాంటిక్‌ వంటి ప్రాంతాల్లోనే కనిపించనుంది. ఈ ఏడాదిలో ఇదే మెుదటి చంద్ర గ్రహణం కానుంది.

సాధారణంగా భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖపై వచ్చినపుడు గ్రహణాలు సంభవిస్తాయి. చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చి ఆ నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు కనిపించడు. ఇది పౌర్ణమి నాడు సంభవిస్తుంది. ఫలితంగా పౌర్ణమిరోజు పూర్ణ చంద్రుడు గ్రహణ సమయంలో కనిపించడు. అంతేకాకుండా గ్రహణానికి ముందు ఎరుపు రంగులో చంద్రుడు ప్రకాశిస్తాడు. సూర్యకాంతి పొందిన భూమి వాతావరణం చంద్రుడిపై ప్రతిబింబించడంతో ఎర్రగా మారుతుంది. అయితే, అన్ని పౌర్ణమిలలోనూ చంద్రగ్రహణం ఏర్పడదు.

 

Exit mobile version