Kuwait Fire Tragedy:కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదానికి సుమారు 49 మంది విదేశీ కార్మికులు ఆహుతి అయ్యారు. చనిపోయిన వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. పలు దేశాల నుంచి ఇక్కడికి ఉద్యోగాల కోసం వచ్చిన కార్మికులు నిద్రలోనే అనంత లోకాలకు చేరుకున్నారు. కువైట్‌లోని మన్‌గాఫ్ నగరంలోని భవనంలో అంటుకున్న మంటలకు కనీసం 42 మంది భారతీయ కార్మికులు చనిపోయి ఉంటారని అంచనా. కాగా ఈ భవనంలో సుమారు 196 మంది పురుషులు నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం చూస్తూనే ఈ మంటలు చుట్టుపక్కల భవనాలకు వ్యాపించాయి. కాగా ఈ మంటలకు కొంత మంది కార్మికులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి మొదటి అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా.. కొంత మంది గాయాల పాలయ్యారు. మరి కొంత మంది మంటల నుంచి వెలువడే పొగకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
స్థానిక అధికారులు వెంటన స్పందించి ఫైర్ ఫైటింగ్ టీంను రంగంలోకి దూకి మంటలను ఆర్పించడానికి ప్రయత్నించారు. పైర్ అధికారులు మంటలను ఆపడానికి ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. దీంతో చాలా మంది మంటలకు ఆహుతి అయ్యారు. స్థానిక మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం కాలిబూడిదైన మృత దేహాలు మెట్లపై కనిపించాయని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏమిటో అధికారులు వెల్లడించలేదు. కువైట్ టైమ్స్ మాత్రం మంటలకు ప్రధాన కారణం గ్యాస్ లీక్ అని వెల్లడించింది.
మృతుల్లో 12 మంది కేరళ వారే..(Kuwait Fire Tragedy)
ఇదిలా ఉండగా కేరళ ప్రభుత్వం తమ రాష్ర్టానికి చెందిన 12 మంది కార్మికులను మృతి చెందారని వారిని గుర్తించామని తెలిపింది. కాగా రాష్ర్ట వైద్యశాఖమంత్రి వీణా జార్జి తక్షణమే కువైట్ వెళ్లి బాధితులక సహాయ సహకారాలు అందిస్తారని కేరళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాగా రాష్ర్ట కేబినెట్ సమావేశమై అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున గాయాపడిన వారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. కాగా కేరళలో జరగాల్సిన లోక కేరళ సభను ఈ నెల 14, 15 తేదీకి వాయిదా వేశారు.
ఇక విదేశీ వ్యవహరాల సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ కువైట్ వెళ్లి అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించడానికి .. డీఎన్‌ఏ టెస్ట్‌లు నిర్వహించి మృత దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. తక్షణమే కువైట్ నుంచి తరలించడానికి ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానాన్ని సిద్దం చేశారు.