King Charles: 7 దశాబ్దాల పాటు బ్రిటన్ ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్ -2 గత ఏడాది సెప్టెంబర్ లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్ తదుపరి రాజుగా ఛార్లెస్ -3 బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మే 6 వ తేదీన బ్రిటన్ రాజుగా ఛార్లెస్ -3 (King Charles III) పట్టాభిషేకం జరుగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరగుతున్నాయి. ఛార్లెస్-3 పట్టాభిషేకం మే 6 న వైభవంగా జరగనుంది.
దేశ విదేశాల నుంచి అతిథులు(King Charles)
దేశ విదేశాల నుంచి పలువురు విశిష్ట అతిథిలు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. బ్రిటన్ రాజు పట్టాభిషేకంలో పాల్గొనేందుకు భారత్ నుంచి కూడా ఓ సెలబ్రిటీకి అవకాశం దక్కింది. ఆ సెలబ్రెటీ ఎవరో కాదు.. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్. పట్టాభిషేకం అనంతరం చాలా కార్యక్రమాలు జరుగనున్నాయి. అయితే పట్టాభిషేకం తర్వాత రోజు నిర్వహించే కార్యక్రమంలో హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారత్ నుంచి బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సందడి చేయనున్నారు.
నాకు దక్కిన గొప్ప గౌరవం
ఈ సందర్భంగా సోనమ్ మాట్లాడుతూ ‘ఛార్లెస్ పట్టాభిషేక వేడుకల్లో పాల్గొనేందుకు ఎంతో హ్యాపీగా ఉన్నాను. ఈ ఆహ్వానం నాకు దక్కిన గొప్ప గౌరవం’ అని ఆనందం వ్యక్తం చేసింది. పెళ్లి తర్వాత సోనమ్ కపూర్ తన కుటుంబంతో కలిసి లండన్‌లోనే నివసిస్తోంది. ఇటీవల భారత్‌కు వచ్చిన ఆమె.. ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ను యాపిల్ సీఈవో టిమ్‌కుక్‌తో కలిసి వీక్షించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక బ్రిటన్ రాజు పట్టాభిషేక వేడుకలు మే 6 నుంచి 8 వ తేదీ వరకు అట్టహాసంగా జరగనున్నాయి. బ్రిటన్ రాజ కుటుంబ వేడుకలకు సోనమ్ కపూర్ హాజరు కానుండటం ఇదే తొలిసారి.
Thank you so much for an unforgettable evening! 🏏🇮🇳 https://t.co/JNGdbt6QnJ
— Tim Cook (@tim_cook) April 20, 2023