Site icon Prime9

Kim Jong Un: సైనిక దళాల సందర్శనకు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు.. కిమ్ వారసురాలంటూ ఊహాగానాలు..

Kim Jong Un

Kim Jong Un

Kim Jong Un: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ను సైనికదళాలను సందర్శించడానికి తీసుకువచ్చారు. దేశ సైన్యం యొక్క 75 వ వార్షికోత్సవం సందర్భంగా పదిసంవత్సరాల వయసుగల కిమ్ జు ఏ తన తండ్రికి దగ్గరగా నిలబడి సీనియర్ అధికారులతో కరచాలనం చేసింది. ఆమె తన తండ్రి కిమ్ జోంగ్ ఉన్ పక్కన కూర్చుంది. కిమ్ జు బహిరంగంగా కనపించడం ఇది నాల్గవసారి.

ఈ సందర్బంగా మీడియా కిమ్ జు ఏను ‘గౌరవనీయమైనది’ మరియు ‘ప్రియమైనది’ అని అభివర్ణించింది, ఆమె కిమ్ జోంగ్ ఉన్ వారసురాలిగా ప్రకటించబడుతుందా అనే చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె గత నవంబర్‌లో కూడా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి యొక్క విమాన పరీక్షకు హాజరయింది.బాలిస్టిక్ క్షిపణుల తనిఖీలలో తన తండ్రి వెంటే ఉంది.ప్యోంగ్యాంగ్‌లోని యాంగ్‌గాక్డో హోటల్‌లో జరిగిన విందు సందర్బంగా వీరిద్దరి చుట్టూ ఉన్న అధికారులు చప్పట్లు కొడుతూ చూపించారు. కిమ్ జోంగ్ ఉన్ మరియు అతని కుమార్తె కిమ్ జు ఏ నలుపు సూట్లు ధరించారు. కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జుతో కలిసి రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వెడుతున్నపుడు  వారు చేతులు పట్టుకున్నారు.

సైన్యం కార్యక్రమాలకు కుమార్తెను తీసుకువస్తున్న కిమ్ జోంగ్ ఉన్ ..

సైన్యం చుట్టూ తిరిగే బహిరంగ కార్యక్రమాలకు తన కుమార్తెను తీసుకురావాలనే నిర్ణయం వెనుక కారణం ఏమటన్నది తెలియవలసి ఉంది. ప్రపంచానికి అణ్వాయుధాలను స్వచ్ఛందంగా అప్పగించే ఉద్దేశ్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కుటుంబం యొక్క రాజవంశ పాలన పొడిగింపుకు ఇది ఉత్తర కొరియా అధినేత సమర్దింపని వారుంటున్నారు.ప్యోంగ్యాంగ్‌లో బుధవారం రాత్రి ప్రారంభమైన భారీ సైనిక కవాతుకు ముందుగా సైనికుల సందర్శన జరిగింది. కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కొరియన్ పీపుల్స్ ఆర్మీ జనరల్ ఆఫీసర్ల లాడ్జింగ్ క్వార్టర్స్‌ను సందర్శించారు. విందులో సైనికులకు ప్రోత్సాహకరమైన ప్రసంగం చేశారు.”ప్రపంచంలో అత్యంత బలమైన సైన్యం” నిర్వహిస్తున్నారంటూ అతను వారిని ప్రశంసించాడు.

36 రోజుల పాటు కనిపించని కిమ్ జోంగ్ ఉన్..

ఇటీవల కిమ్ జోంగ్ ఉన్ దాదాపు 36 రోజుల పాటు కనిపించకుండా పోయారు.దీనితో కిమ్ అనారోగ్య సమస్యలపై చర్చ మొదలయింది.2014 తర్వాత అత్యంత దీర్ఘకాలం ప్రజలకు కనిపించకుండా పోయింది ఇప్పుడే అని చెబుతున్నారు. 2014లో కూడా ఆయన సుమారు 40 రోజుల పాటు ప్రజలకు కనిపించకుండా పోయారు.2020లో, కరోనావైరస్ దాదాపు ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు అతని ఆరోగ్యం గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో జరిగిన కార్యక్రమాలకు కిమ్ గైర్హాజరు కావడమే దీనికి కారణం.అతను చనిపోయి ఉంటాడని కూడా కొన్ని మీడియా కథనాలు ప్రసారం చేసింది.

అమెరికాకు ఉత్తరకొరియా వార్నింగ్ ..

గత వారం ఉత్తర కొరియా అమెరికా మిలటరీని తీవ్రంగా హెచ్చరించింది. దక్షిణ కొరియాతో కలిసి సంయుక్తంగా మిలటరీ కవాతు నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా అండతో దక్షిణ కొరియా అత్యాధునిక ఆయుధాలను మొహరించింది. ఇదిలా ఉండగా 2022లో ఉత్తర కొరియా సుమారు 70 బాల్లిస్టిక్‌ మిస్సైల్స్‌తో పాటు అణ్వాయుధ సామర్ధ్యం గల ఆయుధాలతో దక్షిణ కొరియాపై దాడి జరిపింది. కాగా దక్షిణ కొరియా.. అమెరికా కలిసి సంయుక్తంగా మిలిటరీ డ్రిల్లు నిర్వహించడం పట్ల కిమ్‌ ఆగ్రహంతో  ఉన్నారు.. దీంతో అవకాశం చిక్కినప్పుడల్లా దక్షిణ కొరియాపై మిస్సైల్స్‌ ప్రయోగించి రెచ్చగొడుతుంటారు.

కిమ్‌ అనారోగ్యంపై గతంలో కూడా పలు కథనాలు వెల్లువెత్తాయి. చాలా రోజుల కనిపించకుండా పోవడంతో ఆయన బాధ్యతలను తన సోదరికి అప్పగించారన్న వార్తలు వచ్చాయి. మరోమారు చాలా కాలం కిమ్‌ కనిపించకుండా పోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్నారన్న వార్తలు తెరపైకి వచ్చాయి.

 

 

ఇవి కూడా చదవండి:

 

Exit mobile version