Kim Jong Un: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై సౌత్ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ పలు కీలక విషయాలు సేకరించింది. కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర నిద్రలేమి తో బాధపడుతున్నట్టు గుర్తించింది. అదే విధంగా ఆయన బరువు భారీగా పెరిగినట్టు అంచనాకు వచ్చింది. ఆల్కహాల్, నికోటిన్ వ్యసనాల వల్ల ఈ పరిస్థితి వచ్చిందని నిఘా సంస్థ చెబుతోంది. ఈ క్రమంలో కిమ్ ఆరోగ్యం కోసం ఉత్తర కొరియా వైద్యులు శ్రమిస్తున్నట్టు.. ఆయన కు కావాల్సిన చికిత్స పై తగిన సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపింది.
ఏఐ ని ఉపయోగించి(Kim Jong Un)
ఇటీవల నార్త్ కొరియా భారీ ఎత్తున్న విదేశీ సిగరెట్లు, మందు తో పాటు స్నాక్స్ ని దిగుమతి చేసుకున్నట్టు దక్షిణ కొరియా పార్లమెంటరీ ఇంటెలిజెన్స్ కమిటీ సభ్యుడు వెల్లడించారు. కిమ్ ఇటీవల ఫొటోలకు ఆధునిక టెక్నాలజీ ఏఐ ని ఉపయోగించి చూడగా.. అతని స్థూలయాయం బయటిపడినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం కిమ్ బరువు 140 కిలోలుగా ఉండొచ్చని అంచనాకు వచ్చామన్నారు. మద్యానికి, సిగరెట్లకు కిమ్ బానిసైనట్టు అమెరికాకు చెందిన ఓ పత్రిక కథనంలో పేర్కొంది. అంతేకాకుండా అతను నిద్రలేమి సమస్యలు వచ్చాయని తెలిపింది. నిద్ర లేకపోవడంతో కిమ్ కంటి కింద తీవ్రమైన బ్లాక్ సర్కిల్స్ వచ్చాయని కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఇందుకోసం కిమ్ జోల్పిడియం లాంటి ఔషధాలను కూడా వాడుతున్నట్టు ఆ పత్రిక తెలిపింది.
ఉపగ్రహ విఫలంపై స్పందించిన కిమ్ సోదరి
కాగా, ఉత్తర కొరియా మొదటి సారి చేపట్టిన అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగం (Spy satellite) విఫలమైన విషయం తెలిసిందే. ఈ స్పై శాటిలైట్ సముద్రంలో కూలిపోయింది. ఉపగ్రహ ప్రయోగం విఫలైనట్టు ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ అధికారికంగా వెల్లడించింది. శాటిలైట్ ను తీసుకెళ్తున్న రాకెట్ తొలి, రెండో దశల సమయంలో థ్రస్ట్ ను కోల్పోయిందని తెలిపింది. తమ సైంటిస్టులు ఈ వైఫల్యానికి గల కారణాలపై అధ్యయనం చెస్తున్నారని చెప్పింది. ఈ ఉపగ్రహ శకలాలు కొరియా సముద్ర జలాల్లో పడినట్టు తెలిపింది. ఫియాన్ గాన్ ప్రావిన్స్ లోని సోమే శాటిలైట్ లాంచింగ్ గ్రౌండ్ నుంచి మల్లిజియాంగ్ -1 నుంచి శాటిలైట్ ను ప్రయోగించారు.
ఈ విషయంపై కిమ్ జోంగ్ సోదరి కిమ్ యో జోంగ్ స్పందించారు. నార్త్ కొరియా త్వరలోనే నిఘా ఉపగ్రహన్ని కక్ష్యలోకి పంపిస్తుందని.. నిఘా వ్యవస్థ బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని ఆమె తెలిపినట్టు ఈ దేశ మీడియా కేసీఎన్ఏ పేర్కొంది.