Site icon Prime9

Kim Jong-Un: ఉత్తర కొరియా అధినేత కిమ్‌కు వర్జిన్‌ బాలికల పిచ్చి!!

Kim Jong-Un

Kim Jong-Un

Kim Jong-Un: ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ గురించి తరచూ ఆశ్చర్యకరమైన విషయాలను వింటుంటాం. అయితే ఈ సారి మాత్రం మరో దిగ్ర్భాంతికరమైన విషయాలను ఉత్తర కొరియా నుంచి తప్పించుకొని వచ్చిన యోన్మి పార్క్‌ అనే మహిళ బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. ఈ విషయాలను బ్రిటిన్‌కు చెందిన మిర్రర్‌ అనే పత్రిక ప్రచురించింది. ఉత్తర కొరియా డిక్టేటర్‌ ప్రతి ఏడాది ఓ పాతిక మంది వర్జిన్‌ గర్ల్స్ ను ఎంపిక చేసి వారిని కిమ్‌ ప్లేజర్‌ స్వాడ్‌ వద్దకు పంపిస్తుంటారు. అయితే అమ్మాయిలను వారి లుక్స్‌ను బట్టి వారు నమ్మకంగా ఉంటారా అని పరీక్షించిన తర్వాత మాత్రమే వారిని సెలెక్ట్‌ చేస్తారని ఆమె చెప్పారు. కాగా తనను కూడా రెండుసార్లు కిమ ప్లేజర్‌ క్వాడ్‌కు ఎంపిక చేశారు. అయితే తన కుటుంబ బ్యాక్‌ గ్రౌండ్‌ నేపథ్యంలో వారు తనను తిరస్కరించారని ఆమె చెప్పుకొచ్చారు.

సెలక్షన్ వెనుక పెద్ద తతంగం..(Kim Jong-Un)

ఇక వర్జిన్‌ గర్ల్స్‌ ఎంపిక విషయానికి వస్తే వారు ప్రతి క్లాస్‌ రూంకు వెళతారు. క్లాస్‌ రూంలో లేరు అనుకుంటే స్కూల్‌ ఆవరణ అంతా కలయతిరిగి మంచి అందమైన అమ్మాయి కనిపిస్తే వారిని ఎంపిక చేస్తారు. అటు తర్వాత అమ్మాయి కుటుంబ నేపథ్యంలో వారి రాజకీయ స్టాటస్‌ను చెక్‌ చేస్తారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఉత్తర కొరియా నుంచి తప్పించుకపోయిన కుటుంబాలు అని తెలిస్తే వారిని తిరస్కరిస్తారు. లేదా ఆ అమ్మాయికి సంబంధించిన కుటుంబాలు దక్షిణ కొరియా లేదా ఇతర దేశాల్లో ఉన్నా ఆ అమ్మాయి అనర్హత సాధించినట్లే. ఒక వేళ అమ్మాయి సెలెక్ట్‌ అయితే వెంటనే ఆ అమ్మాయిని వైద్య పరీక్షలకు పంపిస్తారు. ఈవైద్య పరీక్షలో ఆ అమ్మాయి వర్జిన్‌ అంటే కన్యనా కాదా అని తేలిపోతుంది. ఒక వేళ వైద్య పరీక్షలో చిన్నపాటి డిఫెక్ట్‌ ఉన్నా లేదా ఒంటిపై చిన్నపాటి గీత ఉన్నా ఆ అమ్మాయి అనర్హత సాధించినట్లే. ఎంపిక చేసిన బాలికలకు అత్యంత కఠిన శిక్షణ ఇప్పిస్తారు. ఈ బాలికల ఎంపిక విషయానికి వస్తే ఉత్తర కొరియా మొత్తం గాలింపు చేస్తారు. ఎంపిక చేసిన బాలికలను అటు నుంచి ప్యాంగ్‌యాంగ్‌కు పంపిస్తారు. ఇక వీరు చేయాల్సిన పని డిక్టేటర్‌ కిమ్‌ కోరికలను తీర్చడమే.

ఇక ఎంపిక చేసిన బాలికలను మూడు విభాగాలు విడదీస్తారు. ఎంపిక చేసిన పాతిక మంది అమ్మాయిల్లో కొంత మందికి మసాజ్‌లో శిక్షణ ఇప్పిస్తారు. మరి కొందరికి పాటలు, డ్యాన్స్‌లో శిక్షణ ఇప్పిస్తారు. మూడో గ్రూపు విషయానికి వస్తే కిమ్‌తో పాటు ఇతరుల సెక్స్‌ కోరికలు తీర్చడమే. అయితే డిక్టేటర్‌ అంటే కిమ్‌ను సెక్స్‌లోఎలా ఆనందింపచేయాలో ఈ వర్జిన్‌బాలికలకు శిక్షణ ఇప్పిస్తారని పార్క్‌ వివరించారు. అత్యంత ఆకర్షణీయమైన బాలికలు కిమ్‌ కోరికలు తీర్చాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అమ్మాయిల విషయానికి వస్తే తక్కువ ర్యాంకింగ్‌ కలిగిన జనరల్స్‌, రాజకీయ నాయకుల కోరికలను తీర్చాల్సి ఉంటుంది. ఇక ఈ వర్జిన్‌ అమ్మాయిలు 20 ఏళ్ల వయసు వచ్చే సరికి వారి కాలపరిమితి ముగుస్తుంది. అప్పుడు ఈ అమ్మాయిలే నాయకుల బాడీ గార్డులను పెళ్లి చేసుకుంటారు. అయితే ఈ ప్లేజర్‌ స్క్వాడ్‌ తంతు 1970 నుంచి కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తండ్రి నుంచి మొదలైంది. కిమ్‌ జాంగ్‌ -2 విషయానికి వస్తే సెక్సువల్‌ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటే సుదీర్ఘకాలం పాటు బతకవచ్చునని ఆయన భావించారు. అయితే 2011లో ఆయన 70 ఏళ్ల వయసులో తీవ్రమైన గుండె పోటుతో మరణించారు.

ఇక ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే తమ బాలికలను కిమ్‌ దగ్గర పంపడానికి తల్లిదండ్రులు కూడా సంతోషంగా అంగీకరిస్తారు. ఎందుకంటే ఇక్కడ తమతో ఉంటే అర్ధకలితో మాడిపోయే బదులు కిమ్‌ దగ్గర సుఖంగా ఉంటారనే ఉద్దేశమే కారణమని యోన్మి పార్క్‌ చెప్పారు.

Exit mobile version