Site icon Prime9

Britain Junior doctors strike: జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బ్రిటన్ లో రోడ్డెక్కిన జూనియర్ డాక్టర్లు..

BRITAIN

BRITAIN

Britain Junior doctors strike: తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ యూకేలో జూనియర్ డాక్టర్లు మూడు రోజుల సమ్మె ప్రారంభించారు.ద్రవ్యల్బణానికి తగ్గట్టు తమ వేతనాలు లేవని వారు అంటున్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. జీవన వ్యయం పెరిగిపోవడంతో బ్యాంకుల నుంచి తీసుకున్న స్టూడెంట్‌ రుణాలు ఎలా చెల్లించాలో దిక్కుతోచడం లేదని 28 ఏళ్ల ఓ జూనియర్‌ డాక్టర్‌ తన ఆవేదన వెళ్లగక్కాడు. కోవిడ్‌ -19 మహమ్మారి సమయంలో వరదలా పెషంట్స్‌ వచ్చారని ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా వారికి సేవలందించామని జూడాలు చెబుతున్నారు. తమ సేవలకు ప్రజల నుంచి ప్రశంసలందినా.. తమ బిల్లులు వారు చెల్లించరు కదా అంటున్నారు జూనియర్‌ డాక్టర్లు.

ప్రభుత్వ వైఖరికి విసిగిపోయిన జూనియన్‌ డాక్టర్లు నేటినుంచి (మార్చి 13) దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సమ్మెకు దిగాలని నిర్ణయించారు.దీంతో దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోతాయి. ఇప్పటికే రికార్డుస్థాయిలో పేషంట్స్‌ వెయిటింగ్‌ లిస్టు ఉంది. సమ్మెతో ఈ వెయిటింగ్‌ లిస్టు మరింత పెరిగిపోతుంది. చాలా మంది డాక్టర్లు తమ ప్రొపెషన్‌కు విలువ లేకుండా పోయిందని ఆవేదన వెళ్లగక్కారు. ట్రైనీలతో సహా దాదాపు 61,000 మంది జూనియర్ డాక్టర్లు జీతం 26 శాతం పెంచాలని కోరుతూ సోమవారం ఉదయం 7 గంటల నుంచి 72 గంటలపాటు పనిని నిలిపివేస్తున్నారు.

తక్కువ వేతనాలతో ఇబ్బందులు..(Britain Junior doctors strike)

సాధారణంగా బ్రిటన్‌లో వారానికి 40 గంటల పాటు పనిచేస్తే ఏడాదికి 40వేల పౌండ్లు వేతనాలు లభిస్తోంది. అదనంగా వారానికి 48 గంటల పాటు పనిచేసి అనదంగా కొంత డబ్బు సంపాదించుకుంటున్నారు. వెస్ట్‌ లండన్‌లో ఫ్లాట్‌ అద్దె నెలకు 1,000 పౌండ్లు వరకు ఉంటోంది. ప్రస్తుతం అంత అద్దె చెల్లించలేక షేరింగ్‌ చేసుకోవాల్సి వస్తుందంటున్నారు జూనియర్‌ డాక్టర్లు. కరోనా సమయంలో తాము పనిగంటలను పక్కనపెట్టి రాత్రింబవళ్లు పెషంట్స్‌కు సేవలందించామని, అయినా ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదంటున్నారు డాక్టర్లు. డాక్టర్లు అయినా సామాన్యుడు అయినా ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం కదా అని అంటున్నారు డాక్టర్లు. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఆహార ద్రవ్యోల్బణం 17 శాతానికి ఎగబాకింది. గత కొన్ని సంవత్సరాల నుంచి తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు బ్రిటన్‌ జూనియన్‌ డాక్టర్లు.

వేతనాల్లో నాలుగో వంతు కోత..

జూనియర్‌ డాక్టర్లు వేతనాల్లో నాలుగోవంతు కోత పడుతోంది. గత 15 సంవత్సరాల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఇప్పటికే బ్రిటన్‌లో వైద్య రంగానికి చెందిన నర్సులు, అంబులెన్స్‌ కార్మికులతో పాటు ఇతర సిబ్బంది సమ్మెబాట పట్టారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతతో పనిభారం పెరిగిపోతోందని సీనియర్‌ డాక్టర్లు వాపోతున్నారు.స్టూడెంట్‌ లోన్‌ కింద తాను లక్ష పౌండ్లు రుణం తీసుకున్నానని ఇప్పుడిప్పుడే జూనియర్‌ డాక్టర్‌ వృత్తిలోకి వచ్చిన ఓ వైద్య విద్యార్థి చెప్పాడు. లక్ష పౌండ్లు రుణం అంటే భారతీయ కరెన్సీ ప్రకారం కోటి రూపాయల వరకు ఉంటుంది. ఇంత తక్కువ వేతనంతో పనిచేయడం అసాధ్యమని చెబుతున్నారు జూడాలు. ఇవే కాకుండా పరీక్షలు రాయడానికి అదనంగా ఫీజులు చెల్లించాల్సి వస్తోందని ఈ జూడా వాపోయాడు. డాక్టర్‌ ప్రొఫెషన్‌లో పెద్దగా డబ్బులేదు. దీర్ఘకాలంగా పాటు ఈ వృత్తిలో కొనసాగలేమని, ఈ వృత్తిపై ఇష్టం ఉన్నా డబ్బు లేనందు వల్ల ఇతర వృత్తుల్లోకి వెళతామంటున్నారు జూనియర్‌ డాక్లర్లు.

బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది.. డబుల్‌ డిజట్‌కు చేరింది. రష్యా, ఉక్రెయిన్‌ ఉద్యమంతో ఇటు ఇంధన ధరలతో పాటు ఆహారం ధరలు పెరిగిపోయాయి. పరిస్థితిని అదుపులో చేయడంలో కొత్తగా పగ్గాలు చేపట్టిన రిషి సునాక్‌ కూడా విఫలం అయ్యారు.

Exit mobile version