Site icon Prime9

Japan: మందు తాగండోయ్‌ బాబు అంటున్న జపాన్ సర్కార్

Japan: మందు తాగండోయ్‌ బాబు. మందు తాగండోయ్‌ అంటూ యువతను బతిమాలుకుంటోంది జపాన్‌ ప్రభుత్వం. సడెన్‌గా జపాన్‌ యువత బుద్ది మంతులయ్యారు. మందుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూకు గండిపడింది. డబ్బులేకపోతే ప్రభుత్వాన్ని ఎలా నడపాలి. ఈ సమస్య కేవలం జపాన్‌కు మాత్రమే కాదు. మన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఖజానా నింపుకోవాలంటే ఠక్కున ప్రభుత్వాలకు గుర్తు వచ్చేది మద్యం. ఇక్కడ మన ప్రభుత్వాల విషయానికి వస్తే ఒక పక్క మద్యం నిషేధం సూక్తులు వల్లిస్తూనే మరో పక్క మందు తాగే సామన్యుడి జేబుకు కన్నం వేస్తుంటాయి.

సరిగ్గా జపాన్‌లో కూడా ఇదే సీన్‌ రీపిట్‌ అయ్యింది. యువత మద్యానికి దూరంగా కావడంతో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూకు భారీ గండిపడింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో జపాన్‌ మూడోస్థానంలో ఉంది. ఎందుకు రెవెన్యూ తగ్గిందా అని చూస్తే, కరోనా మహమ్మారి తర్వాత నుంచి ఆల్కాహాల్‌ అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. మద్యం అమ్మకాలు తగ్గాయి అంటే ప్రభుత్వానికి లిక్కర్‌ మీద వచ్చే టాక్స్‌కు గండిపడ్డే కదా. దీంతో జపాన్‌ ప్రభుత్వం కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుంది. రెవెన్యూ పెంచుకోవాడానికి లిక్కర్‌ అమ్మకాలు పెంచుకోవాల్సిందేనని నిర్ణయించింది. యువతను మందు తాగేలా ప్రోత్సహించేందుకు పోటీలు పెట్టింది. ఆల్కాహాలు విక్రయాలు పెంచుకొనేందుకు ‘సాకే వివా’ పేరుతో ప్రచారం కూడా ప్రారంభించింది. జపాన్‌ నేషనల్‌ టాక్స్‌ ఏజెన్నీ ఈ ప్రచార కార్యక్రమాన్ని మేనేజ్‌ చేస్తుంది. దీంతో పాటు యువతను మద్యం వైపు ఆకర్షించడానికి ప్రజల వద్ద ఐడియాలు ఉంటే తమ తెలియజేయాలని కోరింది.

ఇక జపాన్‌ విషయానికి వస్తే దేశీయంగా మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గముఖం పట్టాయి. కోవిడ్‌ -19 తర్వాత శిశు జననాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. జనాభాలో ముసలివాళ్ల సంఖ్య కూడా పెరిగిపోవడంతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం జపాన్‌ ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి మద్యం ఒక్కటే కామదేనువుగా కనిపించింది. యువతను మద్యం తాగేలా ప్రోత్సహించి ఖజనాను నింపుకోవాలనేది జపాన్‌ సర్కార్‌ ఆలోచన. ప్రభుత్వ ఆలోచనను జపాన్‌ ప్రజలకు కూడా తప్పుబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జపాన్‌ ప్రభుత్వంస్కీంపట్ల పెదవి విరిస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనా సరళి సరిగా లేదని, ఖజనా నింపుకోవడం సరే, ప్రజలు అనారోగ్యానికి గురైతే ఎవరూ బాధ్యత తీసుకుంటారు అని నిలదీస్తున్నారు. గుడ్‌ క్వొశ్చన్‌ అంటున్నారు నెటిజన్లు.

Exit mobile version