Site icon Prime9

Japan: జపాన్ లో వరుసగా 21 భూకంపాలు.. సునామీ హెచ్చరికలు జారీ

Japan

Japan

Japan: సోమవారం జపాన్‌లో వరుసగా 21 బలమైన భూకంపాలు సంభవించాయి. దీనితో జపాన్ వాతావరణ సంస్ద సునామీ హెచ్చరికను జారీ చేసింది. ప్రజలను త్వరగా తీరప్రాంతాలను విడిచిపెట్టమని కోరింది.జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం, భూకంపం ఇషికావా మరియు సమీపంలోని ప్రిఫెక్చర్‌లను తాకింది, వాటిలో ఒకటి 7.6 ప్రాథమిక తీవ్రతను కలిగి ఉందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. స్థానిక వాతావరణ సంస్థల ప్రకారం, భూకంపం తర్వాత ఇషిగావాలోని నోటోలో భూకంప కేంద్రం నుండి 300 కిలోమీటర్ల దూరంలో సునామీ అలలు వచ్చే అవకాశం ఉంది.

సునామీ హెచ్చరికలు..( Japan)

ఇషికావాలోని నోటో తీరాన్ని 5 మీటర్ల ఎత్తులో అలలు తాకడంతో ప్రజలు త్వరగా తీర ప్రాంతాలను విడిచిపెట్టి భవనాలు లేదా ఎత్తైన భూమికి వెళ్లాలని కోరారు. 4.0 తీవ్రతతో 21 భూకంపాలు నమోదైనట్లు స్థానిక వాతావరణ కార్యాలయం తెలిపింది. 1 మీటరు కంటే ఎక్కువ సునామీ తీవ్రతకు ప్రభావితమయ్యే వ్యక్తులు తట్టుకోలేక మరణించే అవకాశం చాలా ఎక్కువ అని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతారణ శాఖ ఇషికావా, నీగాటా మరియు టొయామా ప్రిఫెక్చర్‌ల పశ్చిమ తీర ప్రాంతాలలో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. నీగాటా మరియు టొయామాతో సహా ఇతర ప్రిఫెక్చర్‌లలో అలలు 3 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి.మరోవైపు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మరియు రష్యాలోని సుదూర తూర్పు నగరాలైన వ్లాడివోస్టాక్ మరియు నఖోడ్కాలకు ఈ దేశాల ప్రభుత్వాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి.రాజధాని టోక్యోలో మరియు కాంటో ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయని జపాన్ టైమ్స్ నివేదించింది.నష్టం లేదా ప్రాణనష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు.

రైళ్లు నిలిపివేత..

భూకంపాలు మరియు సునామీ హెచ్చరికల నేపథ్యంలో మధ్య మరియు తూర్పు జపాన్‌లో షింకన్‌సేన్ బుల్లెట్ రైలు సేవలను నిలిపివేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.సునామీ తర్వాత దాదాపు 34,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూకంప కేంద్రం సమీపంలోని మధ్య జపాన్‌లోని అనేక ప్రధాన రహదారులు మూసివేయబడ్డాయి. ఇషికావా మరియు నీగాటాలో ఫోన్ మరియు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది.ఇషికావా మరియు టొయామా ప్రిఫెక్చర్లలో 36,000 కంటే ఎక్కువ గృహాలు విద్యుత్తును కోల్పోయాయని యుటిలిటీస్ ప్రొవైడర్ హోకురికు ఎలక్ట్రిక్ పవర్ తెలిపింది.జపాన్ ప్రధాన మంత్రి కార్యాలయం సునామీ సలహాను జారీ చేసింది, సునామీ మరియు ప్రజలను తరలించడానికి సంబంధించి ప్రజలకు సకాలంలో మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని మరియు నష్టాన్ని నివారించడానికి సమగ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. నష్టాన్ని అంచనా వేయాలని మరియు సునామీ అలలు కనిపించిన తీర ప్రాంతాలలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడంలో మరియు మానవ ప్రాణాలను రక్షించడంలో ప్రాధాన్యత ఇవ్వడంలో స్థానిక ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో వ్యవహరించాలని అధికారులను కోరింది.

 

 

Exit mobile version