Site icon Prime9

Italy: ఎండిపోయిన వెనిస్ కాలువలు.. కరువు కోరల్లో ఇటలీ..

Italy

Italy

Italy: గత ఏడాది యూరప్‌లో ఎండలు ఠారేత్తించాయి. ఈ ఏడాది కూడా అదే సీన్‌ రిపీట్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇటలీలో కరువు చాయలు కనిపిస్తున్నాయి. అందమైన వెనిస్‌ కాలువలు పర్యాటకులతో కళకళ లాడేవి ప్రస్తుతం ఎండిపోయి కళావిహీనంగా మారిపోయాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి.

అతి తక్కువ వర్షపాతం..(Italy)

వెనిస్‌ కాలువలు ఎండిపోవడానికి ప్రధాన కారణం వర్షపాతం తగ్గిపోవడంతో పాటు హై ప్రెషర్‌ సిస్టమ్‌తో పాటు పుల్‌ మూన్‌, సీ కరెంటు సముద్ర తరంగాలు కారణమని దీంతో ఇటలీలోని నదులు కాలువలు ఎండిపోతున్నాయని శాస్త్రవేత్తలతో పాటు పర్యావరణానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటలీలో కొన్ని వారాల పాటు కొనసాగిన పొడి వాతావరణంతో మరోమారు గత ఏడాది మాదిరిగానే కరువు బారిన పడే అవకాశాలున్నాయని శాస్ట్రవేత్తలు చెబుతున్నారు. మంచుకొండల్లో సాధారణం కంటే అతి తక్కువ మంచుకురువడం కూడా కరువుకు కారణమని శాస్ర్తవేత్తలు, పర్యావరణ గ్రూపులు చెబుతున్నాయి.

ముందుగా పెద్ద ఎత్తున వెనిస్‌కు హెచ్చరికలు వచ్చాయి. సాధారణంగా ఇక్కడ తరచూ వరదలు వస్తుంటాయి. తక్కువ స్థాయిలో అలలు వచ్చినా ఇక్కడ వాటార్‌ టాక్సీలు, వెనిస్‌ కాలువలో వినియోగించే తేలికపాటి పడవులు నడిపించడం అసాధ్యం అవుతుంది. ప్రస్తుతం ఈ కాలువలు దాదాపు ఎండిపోయాయి వెలవెల పోతున్నాయి. అత్యల్ప వర్షపాతం నమోదు కావడంతో నదులు, సరస్సులు ఎండిపోతున్నాయి. ఇటలీకి చెందిన అతి పొడవైన నదులకు మంచుకొండల నుంచి కరిగి వచ్చే నీరు ఈ సారి 61 శాతం తగ్గిందని చెబుతున్నారు. దీంతో దేశంలో కరువుకాటకాలు ఏర్పడ్డాయి.

రెండేళ్లనుంచి  నీటికొరత..

గత ఏడాది జులైలో ఇటలీలోని ది పొ చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఇక పొ నది విషయానికి వస్తే దేశంలోని వ్యవసాయ ఉత్పత్తికి కావాల్సిన నీటిలో మూడో వంతు ఈ నదిపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నది ఎండిపోవడంతో ఇటలీ గత 70 ఏళ్లలో ఎన్నడూలేని కరువు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఇటలీ 2020-21 నుంనే నీటి కొరతను ఎదుర్కొంటోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాయువ్య ప్రాంతం నుంచి 500 మిల్లీమీటర్ల నీటిని కవర్‌ చేయాల్సి ఉందని దీంతో పాటు 50 రోజుల పాటు భారీ వర్షాలు పడితే ఈ కరువు నుంచి తప్పించుకోలేమని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఇటలీ ఉత్తర ప్రాంతానికి చెందిన గార్దా సరస్సులో నీటి మట్టం అత్యంత కనిష్టానికి దిగివచ్చింది. దీంతో చుట్టు పక్కల గల చిన్న చిన్న ద్వీపాలకు తేలిగ్గా చేరుకోవచ్చు.

వచ్చే 15 రోజుల పాటు పశ్చిమ యూరోప్‌లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని సాధారణంగా వసంత కాలం చివర్లో వచ్చే ఎండలు ఇప్పుడే చూడాల్సి వస్తోంది. మొత్తానికి ఈ ఏడాది కూడా యూరప్‌ వాసులు కూడా విపరీతమైన ఎండలు భరించాల్సి రావచ్చు.

Exit mobile version