IT Layoffs: ఐటీ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ట్విటర్ , ఫేస్ బుక్ వంటి అగ్ర కంపెనీలతో పాటు చిన్నచిన్న టెక్ సంస్థలు వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించాయి.
తాజాగా ఈ లిస్ట్ లో ఐబీఎమ్ కూడా చేరింది. 3900 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు ఐబీఎమ్ ప్రకటించింది.
ఐబీఎమ్ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది కంపెనీ వృద్ధి 12 శాతం క్షీణించింది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ నష్టాలను ఎదర్కొంది. షేర్లు కూడా 2 శాతం పడిపోయాయి.
క్యాష్ ఫ్లో తగ్గడం, పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా ఉద్యోగాలు తొలిగింపుకు కారణం’ అని సంస్థ తెలిపింది.
కిండ్రిల్ బిజనెస్ , వాట్సన్ హెల్త్ విభాగాల్లో ఈ కోతలను విధించింది ఐబీఎం.
జనవరి, మార్చి మధ్య కాలంలో 300 మిలియన్ డాలర్ల ఖర్చువుతుందని అంచనా వేసిన ఐబీఎం.. ఉద్యోగుల తొలగింపుతో భారం తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది.
మొత్తంగా కంపెనీలో 1.5 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకుంది.
అయితే సంస్థ లో వివిధ విభాగాల్లో ఉద్యోగులను తొలగించినప్పటికీ, కొన్ని విభాగాల్లో కొత్త ఉద్యోగుల్ని తీసుకుంటామని పేర్కొంది.
ఐబీఎమ్ లో ఉద్యోగాల కోత ఏయో దేశాలకు వర్తిస్తుందో కంపెనీ వెల్లడించలేదు.
ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి అనేక కారణాలతో ప్రస్తుతం చాలా కంపెనీలు నిర్వహణా వ్యయాలను తగ్గించుకునే పనిలో పడ్డాయి.
ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ట్విటర్ , ఫేస్ బుక్ వంటి సంస్థల్లో ఇప్పటి వరకు 44 వేల మంది లేఆఫ్స్ జరిగాయి.
శాప్ లోనూ..
జర్మన్ సాఫ్ట్ వేర్ దిగ్గజం శాప్ లో కూడా ఉద్యోగాల కోత పడనుంది. ఈ ఏడాది 3 వేల మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది.
సంప్రదాయ, క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్ సేవలు రెండింటినీ అందిస్తుంది. వ్యాపారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా కంపెనీ పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టినట్టు శాప్ పేర్కొంది.
అందులో భాగంగానే ఉద్యోగులపై వేటు పడింది.
శాప్ నిర్ణయంతో మొత్తం వర్క్ ఫోర్సులో 2.5 శాతం మందిపై ప్రభావం పడే అవకాశం ఉంది.
శాప్ లో ప్రపంచ వ్యాప్తంగా లక్షా 20 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో దాదాపు 3 వేల మందికి లే ఆఫ్ ప్రకటించింది.
అయితే శాప్ ఈ ఏడాది 30.9 శాతం బిలియన్ యూరోల ఆదాయాన్ని అర్జించింది. గత ఏడాదితో పోలిస్తే 11 శాతం ఎక్కువ.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/