Site icon Prime9

Israeli Attacks: గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడులు.. 24 గంటల్లో 240 మంది మృతి

Israeli Attacks

Israeli Attacks

Israeli Attacks: గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 240 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ( ఐడీఎఫ్ ) సెంట్రల్ గాజాలో త మంగళవారం 100 ప్రాంతాలపై దాడి చేసినట్లు తెలిపింది.

భూభాగం గుర్తించలేనట్లు మారింది..(Israeli Attacks)

స్ట్రిప్‌లో 241 మంది మరణించగా 382 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తన ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాన్ని గొప్ప నేరంగా అభివర్ణించారు. ఇవి అపూర్వమైన దాడులన్నారు. తమ భూభాగం గుర్తించలేనట్లగా మారిందని, గాజాలో ఇజ్రాయెల్ కార్యకలాపాలు వినాశన యుద్ధానికి మించినవని అన్నారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోని తుల్కరేమ్ ప్రాంతంలోని నూర్ షామ్స్ శరణార్థి శిబిరంలో రాత్రిపూట ఇజ్రాయెలీ డ్రోన్ దాడిలో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారు.

ఇజ్రాయెల్ యొక్క చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జి హలేవి మాట్లాడుతూ ఉగ్రవాద సంస్థను కూల్చివేయడంలో షార్ట్‌కట్స్ లేవు. ఇది నిరంతర పోరాటం మాత్రమే. మేము హమాస్ నాయకత్వాన్ని కూడా వారం పట్టినా లేదా నెలలు పట్టినా నాశనం చేస్తామని చెప్పారు. 11 వారాల యుద్ధంలో కాల్పుల విరమణ కోసం ప్రపంచవ్యాప్తంగా పిలుపునిచ్చినప్పటికీ హమాస్‌ను నాశనం చేయాలని ఇజ్రాయెల్ నిశ్చయించుకుంది.రద్దీగా ఉన్న పాలస్తీనియన్ కమ్యూనిటీలపై బాంబు దాడి చేసి నివాసితులను ఖాళీ చేయమని ఆదేశించిన తర్వాత ఐడీఎఫ్ దళాలు సెంట్రల్ గాజాలోని పట్టణ శరణార్థుల శిబిరాల్లోకి కూడా తమ భూ దాడిని విస్తరించాయి. పౌర మరణాలను అరికట్టాలని ఇజ్రాయెల్‌కు అమెరికా పిలుపునిచ్చినప్పటికీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, సైన్యం పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తోందని అన్నారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గాజాలో కనీసం 20,915 మంది మరణించారు. వారిలో మూడింట రెండు వంతుల మంది మహిళలు మరియు పిల్లలు. అక్టోబర్ 7 న ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మందిని చంపి 240 మందిని బందీలుగా చేసిన హమాస్ దాడి తరువాత 11 వారాలుగా యుద్ధం కొనసాగుతోంది.

Exit mobile version