Miracle Surgery: వైద్యశాస్త్రంలో ఇదో మిరాకిల్.. తెగిపోయిన తలను తిరిగి అతికించేశారు

Miracle Surgery: వైద్యో నారాయణో హరిః అంటారు పెద్దలు. ప్రాణాలను నిలబెట్టగల సత్తా ఆ దేవుడి తర్వాత ఈ డాక్టర్లకే ఉందని మన విశ్వాసం. సాధ్యకాదు ప్రాణం పోవాల్సిందే అనుకున్న ఎన్నో కేసులను విజయవంతం చేసి ప్రాణాలు నిలబెట్టిన ఘనత వైద్యశాస్త్రానికే ఉంది.

Miracle Surgery: వైద్యో నారాయణో హరిః అంటారు పెద్దలు. ప్రాణాలను నిలబెట్టగల సత్తా ఆ దేవుడి తర్వాత ఈ డాక్టర్లకే ఉందని మన విశ్వాసం. సాధ్యకాదు ప్రాణం పోవాల్సిందే అనుకున్న ఎన్నో కేసులను విజయవంతం చేసి ప్రాణాలు నిలబెట్టిన ఘనత వైద్యశాస్త్రానికే ఉంది. ఇలాంటి ఘటనే ఒకటి ఇజ్రాయెల్ లో చోటుచేసుకుంది. అక్కడి వైద్యులు అద్భుతం చేశారనే చెప్పాలి. వెన్నుముక నుంచి వేరైన తలతో ఎవరైనా బ్రతుకుతారా చెప్పండి.. కానీ అలా వేరైన తలను తిరిగి శరీరానికి జోడించి ఓ పసివాడి ప్రాణాన్ని నిలబెట్టారు ఇజ్రాయెల్ వైద్యులు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ బాలుడికి తిరిగి ప్రాణదానం చేశారు. వెన్నెముక నుంచి విడిపోయిన తలను మళ్లీ జతపరిచి అతడిని తిరిగి యథావిధిగా కోలుకునేలా చేశారు. జోర్డాన్ వ్యాలీకి చెందిన సులేమాన్ హసన్(12) అనే బాలుడికి గతేడాది తన ఇంటి వద్ద సైకిల్ తొక్కుతుండగా కారు ఢీకొట్టింది. దానితో అతని తల, వెన్నెముక కలిసే చోట లిగమెంట్లు తెగిపోవడంతో అంతర్గతంగా తల, వెన్ను వేరయ్యాయి.

తలను తిరిగి అతికించేశారు(Miracle Surgery)

చికిత్స కోసం ఆ బాలుడిని జెరూసలేంలోని ఈన్ కెరెమ్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు బాలుడి పరిస్థితి చూసి తొలుత షాకయ్యారు ఆ కేసుని ఓ సవాలుగా తీసుకుని ఆ ఆసుపత్రిలోని స్పెషలిస్టులు, నర్సుల బృందం మొత్తం రంగంలోకి దిగారు. దాదాపు కొన్ని గంటల పాటు కష్టపడి అతడికి ఆపరేషన్ చేసి కొత్త కణాలను, నాడులను తిరిగి జోడించారు. వారికి పడ్డ కష్టానికి అదృష్టం కూడా జతచేరి ఏడాది తర్వాత ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. దానితో అతడిని తాజాగా డిశ్చార్జ్ చేశారు ఆసుపత్రి సిబ్బంది.

హసన్ పూర్తి స్థాయిలో కోలుకోవడం ఓ అద్భుతమని ఇజ్రాయెల్ వైద్యులు తెలిపారు. ఇలాంటి ప్రమాదాల్లో సాధారణంగా బాధితులకు మెదడు సంబంధిత సమస్యలు వస్తాయని కానీ హసన్ మాత్రం ఎలాంటి సమస్యా లేకుండా యాక్సిడెంట్ ముందు ఎలా ఉండేవాడో అలానే పూర్తిగా రికవర్ అయ్యాడని చెప్పుకొచ్చారు. కాగా, ఇక తన కొడుకు పూర్తి ఆరోగ్యంగా ప్రాణాలతో తిరిగిరావడంతో హసన్ తండ్రి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తన కొడుకుని కాపాడిన వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు.