Prime9

Iran- Israel War: మొదలైన యుద్ధం.. ఇరాన్ పై బాంబుల వర్షం!

Israel Military Strike on Iran: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ పై దాడులకు దిగింది. న్యూక్లియర్ సెంటర్స్, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఇవాళ ఉదయం దేశ రాజధానిలో పేలుళ్ల శబ్ధం వినిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నట్టు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. కాగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తిప్పికొట్టందుకు ఇరాన్ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపింది. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు మరణించినట్లు సమాచారం. ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఈ దళం అధిపతి మేజర్ జనరల్ హోస్సేన్ సలామీ చనిపోయారని స్థానిక మీడియా తెలిపింది.

 

కాగా ఇరాన్ లోని అణు స్థావరాలే లక్ష్యంగా తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ ప్రతిదాడులు చేసే అవకాశం ఉండటంతో దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. తమ ఆపరేషన్ నేపథ్యంలో ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులతో ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు.

 

కాగా ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ మేరకు ఆయన అఫిషీయల్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. “అది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం కావచ్చు. మా సైనిక కుటుంబాలను, దౌత్య సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నాం. ఆ ప్రాంతాన్ని వీడాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. ఇకపై ఏం జరుగుతుందో చూడాలి” అంటూ రాసుకొచ్చారు.

 

 

Exit mobile version
Skip to toolbar