Site icon Prime9

Israel-Hamas conflict: 1,500 మంది హమాస్ మిలిటెంట్లను చంపినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్.

Israel

Israel

Israel-Hamas conflict: ఇజ్రాయెల్ సైన్యం తమభూభాగంలో దాదాపు 1,500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపింది.ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి  చెప్పిన విషయం తెలిసిందే.  యుద్ధ విమానాలు హమాస్ ప్రభుత్వ కేంద్రాలకు నిలయమైన గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించాయి.

ఇజ్రాయెల్‌పై దాడి చేసి హమాస్‌ చారిత్రక తప్పిందం చేసిందన్నారు ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు. యుద్దం మొదలుపెట్టింది హమాస్‌. ఇక ముగింపు టచ్‌ తామే ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రస్తుతం దేశం యుద్ధం చేస్తోంది. దీన్ని మేం ఏ మాత్రం కోరుకోలేదు. కానీ, తప్పని పరిస్థితుల్లో, దేశాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో యుద్ధం చేయాల్సి వస్తోంది. మేం దీన్ని మొదలుపెట్టాలని కోరుకోలేదు. కానీ, ముగించేది మాత్రం ఇజ్రాయెలేఅని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌పై దాడి చేసి హమాస్‌ చారిత్రక తప్పిదం చేసిందన్నారు. మా ఎదురుదాడి హమాస్‌తోపాటు, ఇజ్రాయెల్‌ శత్రు దేశాలకు దశాబ్దాలపాటు గుర్తుండిపోతుందని నెతన్యాహు హెచ్చరించారు. హమాస్‌ కూడా ఐసిస్‌ లాంటి ఉగ్రవాద సంస్థే. ప్రజలంతా ఏకమై దాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు.

గాజా కు సరఫరాలు బంద్ ..(Israel-Hamas conflict)

హమాస్‌కి గట్టి పట్టున్న గాజాను ఇజ్రాయిల్ అష్టదిగ్బంధనం చేస్తోంది . హమాస్‌ స్థావరాలపై, హమాస్‌ మిలిటెంట్లు పాగా వేసిన గాజాస్ట్రిప్‌పై ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తోంది. అక్కడికి కరెంటు సరఫరా, నీరు, ఆహారం, ఇంధన సరఫరాను ఇజ్రాయిల్ అడ్డుకుంది. గాజాలోని సుమారు వేయికి పైగా ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఈ దాడిలో వందల నిర్మాణాలు కుప్పకూలాయి. గాజాలో లక్షలాది మందికి పైగా నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిండి, నీరు లేకపోవడంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాజాలోని 200 మిలిటెంట్‌ స్థావరాలపై సోమవారం రాత్రి దాడులు చేశామని ది ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ వెల్లడించింది. వీటిలో మిలిటెంట్ల ఆయుధాలు దాచిన ఓ ప్రార్థాన మందిరం, ఒక అపార్ట్‌మెంట్‌ భవనాన్ని కూడా కూల్చివేసినట్లు పేర్కొంది. దీంతోపాటు పలు సైనిక లక్ష్యాలను కూడా ధ్వంసం చేశామని వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలను కూడా తమ వెబ్‌సైట్‌లో ఉంచింది.ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ వాయుసేన జరిపిన దాడులతో గాజా దద్దరిల్లిపోయింది. దాదాపు 790 హౌసింగ్‌ యూనిట్లు కుప్పకూలగా.. దాదాపు 5,330 ఇళ్లు దెబ్బతిన్నాయని ఐక్యరాజ్యసమితి హ్యూమానిటేరియన్‌ అఫైర్స్‌ కార్యాలయం వెల్లడించింది. దీంతో పాటు మూడు తాగునీటి, పారిశుద్ధ్య విభాగ కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయని తెలిపింది. ఈ దెబ్బకు దాదాపు నాలుగు లక్షల మందికి ఈ సేవలు నిలిచిపోయాయని తెలిపింది.

ఇరువైపులా 1,600 మంది మృతి..

పాలస్తీనా వాసులు గాజా నుంచి వీలైనంత త్వరగా ఈజిప్ట్‌ వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ సైన్యం సూచించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన చేసిందినాకు తెలిసినంత వరకు రఫా క్రాసింగ్‌ (గాజా-ఈజిప్టు సరిహద్దు) ఇప్పటికీ తెరిచి ఉంది. ఎవరైన వెళ్లవచ్చు. ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని నేను వారికి చెబుతున్నాను అని ఇజ్రాయెల్‌ చీఫ్‌ మిలటరీ ప్రతినిధి రిచర్డ్‌ హెక్ట్‌ పేర్కొన్నారు. రెండు వైపులా యుద్ధంలో మరణించిన వారి సంఖ్య దాదాపు 1,600కి పెరిగింది. ఇజ్రాయెల్‌లో 73 మంది సైనికులు సహా దాదాపు 900 మంది మరణించారని మీడియా తెలిపింది. గాజాలో, 680 మందికి పైగా మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇరువైపులా వేలాది మంది గాయపడ్డారు. ఇంతలో, ఇజ్రాయెల్ అధికారులు గాజా స్ట్రిప్ సమీపంలోని డజన్ల కొద్దీ పట్టణాలను విడిచిపెట్టాలని నివాసితులను ఆదేశించారు.

 

Exit mobile version