Site icon Prime9

Iran currency: రికార్డు స్థాయిలో పతనమవుతున్న ఇరాన్‌ కరెన్సీ

Iran

Iran

 Iran currency:ఇరాన్‌ కరెన్సీ రికార్డు స్థాయిలో పతనమవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే 6లక్షల ఇరానియన్‌ రియాల్స్‌కు పడిపోయింది. మూడు రోజుల క్రితం ఐదు లక్షల రియాల్‌లుగా ఉండగా.. తాజాగా అది మరింత క్షీణించింది.తాజాగా డాలరుకు 6లక్షల రియాల్స్‌కు పడిపోవడం మాత్రం ఇదే మొదటిసారి.కొన్ని దశాబ్దాలుగా అమెరికా డాలరుతో పోలిస్తే ఇరాన్‌ కరెన్సీ భారీగానే పతనమవుతోంది. 1979లో ఇస్లామిక్‌ విప్లవం సమయంలో డాలరుకు 100 రియాల్స్‌ వద్ద ట్రేడ్‌ అయిన ఇరానియన్‌ కరెన్సీ.. క్రమంగా క్షీణిస్తూ వస్తోంది.

హిజాబ్ ఆందోళనలతో ఆంక్షలు..( Iran currency)

2015లో జరిగిన న్యూక్లియర్‌ ఒప్పందం తర్వాత ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు ఎత్తివేశారు. ఆ సమయంలో ఇరాన్‌ కరెన్సీ విలువ అమెరికా డాలరుకు 32వేల రియాల్స్‌గా ఉండేది. తాజాగా అక్కడ హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు జోరందుకోవడంతో పాశ్చాత్య దేశాల ఆంక్షలు మొదలయ్యాయి. ఇలా గత ఆరు నెలల కాలంలో ఇరాన్‌ కరెన్సీ విలువ 60శాతంపైనే పతనమైంది. గత ఆగస్టులో 3లక్షల రియాల్స్‌గా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి మూడో వారానికి 5లక్షల రియాల్స్‌కు పడిపోయింది. తాజాగా మరింత దిగజారి 6 లక్షల రియాల్స్‌తో అత్యంత కనిష్ఠానికి చేరుకుంది.

ఇరాన్ లో పెరిగిన ద్రవ్యోల్బణం..

ఇక ఇరాన్‌లో జనవరి 2021లో 41.4గా ఉన్న ద్రవ్యోల్బణం ప్రస్తుతం 53.4 శాతానికి చేరినట్లు అక్కడి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇరాన్‌ ప్రభుత్వం తమ కరెన్సీని భారీగా ఖర్చుచేయాల్సి వస్తోంది. అయితే, మనీలాండరింగ్‌తో ఇరాన్‌, సిరియా దేశాలకు అక్రమంగా నగదు తరలివెళ్లడం వల్లే ఇరాన్‌కు డాలర్ల బదిలీపై అమెరికా ఆంక్షలు విధిస్తోందని అక్కడి బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. పరిస్థితులు మరికొంతకాలం ఇలాగే కొనసాగితే అక్కడి పౌరులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదనే భయాలు మొదలయ్యాయి. ఇలా భారీ స్థాయిలో కరెన్సీ విలువ పడిపోతోన్న నేపథ్యంలో అక్కడి పార్లమెంటు అత్యవసరంగా సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇరాన్‌ అధికారిక కరెన్సీ రియాల్‌. కానీ, అక్కడి ప్రజలు స్థానిక అవసరాల కోసం తోమాన్‌ను వినియోగిస్తారు. ఒక తోమాన్‌కు పది రియాళ్లు.

శనివారం సాయంత్రం స్వేచ్ఛా మార్కెట్‌లో డాలర్ ధర 575,000 రియాల్స్‌కు పెరిగింది. స్థానిక కరెన్సీ రికార్డు క్షీణత యొక్క తాజా వేవ్ గురించి చర్చించడానికి ప్రభుత్వ అధికారుల సమక్షంలో పార్లమెంటు నిర్వహించిన సెషన్ ముగిసిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగింది. డాలర్ ధర శుక్రవారం 540,000 దాటింది.అలాగే, ఆదివారం నాడు, యూరో ధర 630,000 రియాల్స్‌కు చేరుకుంది, ముందు కొద్దిగా క్షీణించి 610,000 రియాల్స్ వద్ద ఆగిపోయింది. పౌండ్ స్టెర్లింగ్ ధర 690,000 రియాల్స్ మరియు 700,000 రియాల్స్ మధ్య ఉంది.

వ్యాపారులు నిరసనలు, మానవ హక్కుల రికార్డుపై పాశ్చాత్య ఆంక్షల నేపథ్యంలో రియాల్ తగ్గుముఖం పట్టిందని అంటున్నారు.2018లో యూఎస్ ఆంక్షలను పునరుద్ధరించడం వలన దాని చమురు ఎగుమతులు మరియు విదేశీ కరెన్సీకి ప్రాప్యతను పరిమితం చేయడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కూడా హాని ఉంది.అలాగే, ఆంక్షలను ఎత్తివేయడానికి ప్రతిఫలంగా టెహ్రాన్ యొక్క అణు చర్చలు అరికట్టడానికి ఇరాన్ మరియు ప్రపంచ శక్తుల మధ్య అణు చర్చలు సెప్టెంబర్ నుండి ఆగిపోయాయి, .గత మార్చిలో అణు చర్చలు విఫలమయ్యాయి.

Exit mobile version