Site icon Prime9

Iran Girls: స్కూళ్లకు వెళ్లొద్దంటూ వందలాది విద్యార్థినులపై విష ప్రయోగం

Iran Girls

Iran Girls

Iran Girls: ఇరాన్ లో మహిళలపై జరుగుతున్న మారణకాండ మరవక ముందే మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. బాలికల విద్యను వ్యతిరేకిస్తూ దారుణానికి పాల్పడ్డారు. టెహ్రాన్ లోని కోమ్ లోని ఒక పాఠశాలలో వంలాది విద్యార్థినుల పై విష ప్రయోగం జరిగినట్టు ఇరాన్ హెల్త్ మినిస్టర్ యూనెస్ స్పష్టం చేశారు. ఈ ఘటన ఉద్దేశ పూర్వకంగానే జరిగినట్టు ఆయన వెల్లడించారు.

స్కూళ్లకు పంపొద్దంటూ..

టెహ్రాన్ కు దక్షిణంగా ఉన్న కోమ్ లో గత కొంత కాలంగా స్కూల్ లో అనేక మంది విద్యార్థినులపై విష ప్రయోగం జరిగడం.. వారు శ్వాస కోస సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ ఘోరం తర్వాత ముఖ్యంగా బాలికలను పాఠశాలలకు పంపడాన్ని ఆపేయాలని కోరినట్టు తెలిసిందని ఆ దేశ మీడియా వెల్లడించింది.

అయితే ఇంత దారుణం జరుగుతున్నా ఎవ్వరినీ అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం. ఫిబ్రవరి 14 న కొంతమంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు.

విచారణ చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాలు

కాగా, ఈ ఘటనపై అధికారులను వివరణ కోరేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు నగర గవర్నరేట్ ను నిలదీశారని తెలుస్తోంది. అనంతరం  ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి విష ప్రయోగానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాధానమిచ్చారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని గత వారమే అదేశాలు జారీ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే, గత ఏడాది ఇరాన్ లో హిజాబ్ ధరించినందుకు 22 ఏళ్ల ఇరానియనన్ కుర్ద్ మహ్సీ అమ్నీని కస్టడీలో తీసుకున్నారు. ఆమె డిసెంబర్ 16న మరణించింది. ఈ సంఘటనపై ఇంకా నిరసనలు అట్టుడుకుపోతుండగా.. విద్యార్థునులపై విష ప్రయోగం వెలుగులోకి వచ్చి మరింత చర్చనీయాంశంగా మారింది.

 

 

Exit mobile version