Intel: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి చిన్న స్టార్టప్ ల వరకు అన్ని సంస్థలూ తమ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి.
తాజాగా ఇంటెల్ లేఆఫ్స్ బదులుగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ లోని ఉద్యోగులను తొలగించుకుండా.. వారి జీతాల్లో కోత విధించేందుకు సిద్ధమైంది.
కంపెనీ సీఈఓ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగుల వరకు జీతాల కోతలు ఉండనున్నట్టు ఇంటెల్ కంపెనీ ప్రకటించింది.
సీఈఓ జీతంలో 25 శాతం
కాగా , ఇంటెల్ (Intel) నిర్ణయంతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్( సీఈఓ) పాట్ గెల్సింగర్ తన వేతనంలో 25 శాతం కోత విధిస్తారు.
అదే విధంగా ఎగ్జిక్యూటివ్ లీడర్ షిప్ టీమ్ వేతనాల్లో 15 శాతం, సీనియర్ మేనేజర్ స్థాయిల్లో 10 శాతం కోత పడనుంది. మిడ్ లెవల్ మేనేజర్లకూ 5 శాతం కోత విధించారు.
ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆర్థిక ప్రతికూలతల దృష్ట్యా కంపెనీ అంతా ఖర్చులను తగ్గించుకోవడానికి కృషి చేస్తోంది.
అందుకే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులకు అందించే జీత భత్యాల్లో కోత విధించాలని నిర్ణయం తీసుకున్నాం.
కంపెనీ భవిష్యత్ కు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుంది’ అని ఇంటెల్ తెలిపింది.
ఉద్యోగులకు కొంత రిలీఫ్
ఆర్థిక మాంద్యం భయంతో వరుసగా కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో ఇంటెల్ తాజా నిర్ణయం ఉద్యోగులకు కొంత రిలీఫ్ ఇస్తోంది.
ఇంటెల్ తీసుకున్న నిర్ణయాన్ని నిపుణలు సమర్థిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం పోవడం కన్నా వేతనంలో కోత కొంతమేర సమంజసమంటున్నారు.
అయితే, మార్కెట్ లో ఇంటెల్ కంపెనీ వాటా తగ్గతూ వస్తోంది. దీంతో మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో 20 శాతం మేర ఉద్యోగాల కోత పడనుందని వార్తలు వచ్చాయి.
కానీ, వార్తలకు భిన్నంగా ఇంటెల్ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంతా ఇంటెల్ కు 1,13,700 మంది ఉద్యోగులు ఉన్నారు.
మార్కెట్ లో తగ్గిన ఇంటెల్ వాటా
50 ఏళ్ల చరిత్ర ఉన్న ఇంటెల్ ప్రస్తుతం మార్కెట్ లో అనుకున్న స్థాయిలో వాటా లేదు. గత త్రైమాసికంలో ఇంటెల్ ఆర్థిక ఫలితాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి.
కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేశారు. దీంతో పర్సనల్ కంప్యూటర్(PC)లకు గిరాకీ బాగా పెరిగింది.
కానీ వర్స్ ఫ్రమ్ హొమ్ నుంచి ఉద్యోగులు మళ్లీ ఆఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో పీసీలకు డిమాండ్ పడిపోయింది.
మరో వైపు పీసీలకు కీలక కేంద్రం అయిన చైనాలో కోవిడ్ ఆంక్షలు విక్రయాలపై ప్రభావం చూపాయి.
చిప్ సెట్ రంగంలో ఇంటెల్ కు ఏఎమ్ డీ కంపెనీ గట్టి పోటీ ఇస్తోంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/