Site icon Prime9

Indonesia: ఇండోనేషియా రాజధాని జకార్తా నుండి బోర్నియోకు తరలింపు.. ఎందుకో తెలుసా?

Indonesia

Indonesia

Indonesia:ఇండోనేషియా తన రాజధానిని జకార్తా నుంచి బోర్నియోకు తరలిస్తోంది. 2045 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో ఉన్న ఇండోనేషియా తన కొత్త రాజధాని పర్యావరణ హితంగా ఉంటుందని పేర్కొంది. అంతేకాదు ఇది అటవీనగరంగా ఉంటుందని తెలిపింది.

రాజధాని తరలింపు వెనుక ..(Indonesia)

ప్రస్తుత రాజధాని జకార్తా సుమారు 10 మిలియన్లాతో రద్దీగా మారింది.. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా మునిగిపోతున్న నగరంగా వర్ణించబడింది. నగరంలో మూడింట ఒక వంతు 2050 నాటికి మునిగిపోతారని అంచనా. దీనికి ప్రధాన కారణం విచ్చలవిడిగా భూగర్భ జల వెలికితీత. వాతావరణ మార్పుల కారణంగా జావా సముద్రం,మరియు భూగర్భజలాలు భారీగా కలుషితమయ్యాయి. దీనితో ఏర్పడే ఇబ్బందులను సరిదిద్దడానికి ప్రభుత్వానికి ఏడాదికి 4.5 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా.

కొత్త రాజధాని నగరం ఎలా ఉంటుందంటే..

కొత్త రాజధానిలో ప్రభుత్వ భవనాలను మరియు గృహాలను మొదటి నుండి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది . 1.5 మిలియన్ల మంది ప్రభుత్వ ఉద్యోగులను జకార్తాకు ఈశాన్యంగా 2,000 కిలోమీటర్ల (1,240 మైళ్ళు) దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి తరలిస్తారు. మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ సంస్థలు ఆ సంఖ్యను ఖరారు చేయడానికి కృషి చేస్తున్నాయి.కొత్త రాజధాని నగరం “అటవీ నగరం” భావనను వర్తింపజేస్తుందని, 65% అటవీ ప్రాంతంగా ఉంటుందని నేషనల్ క్యాపిటల్ అథారిటీ అధిపతి బాంబాంగ్ సుసాంటోనో చెప్పారు.ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా వచ్చే ఏడాది ఆగస్టు 17 న నగరాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే నగరం 2045 కు పూర్తవుతందని భావిస్తున్నారు.

పర్యావరణ వేత్తల అభ్యంతరాలు..

బోర్నియో యొక్క తూర్పు కాలిమంటన్ ప్రావిన్స్‌లో 256,000 హెక్టార్ల (990 చదరపు మైలు) నగరాన్ని నిర్మించడం పై పర్యావరణ వేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒరంగుటాన్లు, చిరుతపులులు మరియు ఇతర వన్యప్రాణులు విస్తృతంగా ఉండే ప్రాంతం. ఫారెస్ట్ వాచ్ ఇండోనేషియా, ఇండోనేషియా నాన్గోవర్నమెంటల్ సంస్థలు అటవీ సమస్యలను ప్రస్తావివస్తున్నాయి.కొత్త రాజధాని భారీ అటవీ నిర్మూలనకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.స్దానికుల గృహాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసారు. నిర్మాణం కారణంగా 100 మందికి పైగా స్వదేశీ బాలిక్ ప్రజలతో కనీసం ఐదు గ్రామాలు మకాం మార్చాయి. విస్తరిస్తున్నప్పుడు మరిన్ని గ్రామాలు వేరుచేయబడతాయి. అయితే కొత్త రాజధానికి స్థానిక సమాజ నాయకుల నుండి మద్దతు లభించిందని, నగరానికి భూమిని ఉపయోగిస్తున్న వ్యక్తులకు పరిహారం అందించిందని ప్రభుత్వం తెలిపింది.

ఇండోనేషియా కోర్టు గురువారం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు ఫుట్‌బాల్ మ్యాచ్ అధికారులకు జైలు శిక్ష విధించింది. అక్టోబరులో తూర్పు జావా నగరంలోని మలాంగ్‌లోని ఒక వేదిక వద్ద జరిగిన కొంతమంది పిచ్‌పైకి చొరబడినప్పుడు స్టాండ్‌లపైకి టియర్ గ్యాస్ ప్రయోగించడంతో 135 మంది మరణించారు.

 

Exit mobile version